Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.07.2023
Share:

By Village Missionary Movement

Thursday, 27-Jul-2023

దిన ధ్యానము(Telugu) 27.07.2023

 

అంశం: ఇయ్యుడి

 

"సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" – 2 కోరింథీయులకు 9:7

 

 ఒక వృద్ధుడు మిక్కిలి ఆకలి వలన హోటల్లో భోజనం చేయుటకు వెళ్లాడు.అప్పుడు అక్కడ వచ్చిన సప్లయర్ తో ఒక భోజనం ఎంత అని అడిగారు అందుకు అతడు 50 రూపాయలు అని అన్నారు.వెంటనే ఆ వృద్ధుడు తన పర్సులో గల డబ్బుని లెక్కించి చూసి తక్కువ ధర కి భోజనం లేదా అని అడిగారు. వెంటనే సప్లయర్ పెరుగు లేకుండా భోజనం చేస్తే 45 రూపాయలు అని అన్నారు.ఆ వృద్ధుడు 45 రూపాయలకు పెరుగు లేకుండా భోజనం చేసి 50 రూపాయలు సప్లయర్ కి ఇచ్చారు.ఆయన పెరుగుతో భోజనం చేసి ఉండి ఉండవచ్చు కదా 50 రూపాయలు ఇచ్చారే అని అన్నారు ఆ సప్లయర్ అప్పుడు ఆ వృద్ధుడు నన్ను బాగా గమనించినందుకు నీకు ఇచ్చుటకు డబ్బులు లేవు అందుకే అని నవ్వుతూ వెళ్ళిపోయారు.సప్లయర్ ఆ ఐదు రూపాయలు చాలా విశేషమైనవి అని చెప్పి ఆ డబ్బులను తన జేబులో పెట్టుకున్నారు.

 

 యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన దినాలలో దేవాలయపు కానుక పెట్టె ముందు కూర్చుని ప్రజలు కానుక వేయుట చూస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులను పిలిచి ఒకరి యొక్క కానుకను మాత్రం పొగిడారు అది పేద విధవరాలు వేసిన రెండు నాణెములు. మనుషులు దానిని చాలా తక్కువగా ఆలోచించి ఉండవచ్చు ఎందుకంటే అనేకులు అధికముగా వేశారు అందువలన రెండు నాణెముల యొక్క విలువ తక్కువగా కనబడవచ్చు కానీ దేవుని దృష్టిలో ఈ రెండు నాణెములు అత్యధికముగా కొనియాడబడినవి కారణము ఆ కానుక తనను తాను తగ్గించుకుని వేయబడినది. లోకంలో తనకు తర్వాతే దానము అని చెప్తారు కానీ యేసుక్రీస్తు నిన్ను నీవు తగ్గించుకొని నీకు కలిగి యున్నది ఇచ్చుటయే శ్రేష్టమైనది అని అన్నారు. ఎందుకంటే ఇచ్చుట ప్రేమ యొక్క ప్రత్యక్షతైయున్నది దానిని పేరు ప్రఖ్యాత కొరకు ఇవ్వకూడదు. 

 

మాసిదోనియా సంఘస్తులు ఉపద్రవము, దరిద్రము వీటి మధ్యలో సంపూర్ణ సంతోషంతో మిక్కిలి విస్తారముగా ఇచ్చారు. ఇప్పుడున్న ప్రజలు సమకూర్చుకొనుట గురించే ఆలోచిస్తున్నారు ఇతరుల యొక్క పరిస్థితిని చూచి వారికి అవసరం వచ్చినప్పుడు ఇచ్చుట తగ్గిపోయినది ప్రేమ యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఇవ్వబడుతుందో అక్కడ దేవుని దృష్టి ఆకర్షించబడి ఆయన మనలను పొగుడుతున్నారు. అత్తరు పూసిన మరియా తాను చేయగలిగినది చేసింది పాపి అయిన స్త్రీ కన్నీటితోను తల వెంట్రుకలతోనూ తుడిచి ఆ అత్తరుని పూసినప్పుడు ఈమె నాయందు మిక్కిలిగా ప్రేమ చూపించినది అని పొగుడుతున్నారు.

 

దీనిని చదువుచున్న ప్రియమైన వారలారా! దేవుని ఆకర్షణను పొందుకొనుటకు మీరు కూడా విస్తారంగా ఇవ్వు డి మిమ్ములను మీరు తగ్గించుకుని ఇచ్చుట దానిని దేవుడు చూచి విస్తారముగా పొంగి పొర్లేటట్లు దేవుడు మిమ్ములను దీవిస్తారు మీరు పొందుకున్న వారుగా దీవించబడినవారుగా మారతారు.

- సహోదరి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:- 

మధ్యవర్తిగా ఉండి ప్రార్థించే ఎస్తేరు వంటి స్త్రీలు ఫీల్డ్ లో లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet