Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.07.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 25-Jul-2023

దిన ధ్యానము(Telugu) 26.07.2023

 

అంశం: కృతజ్ఞత స్తుతులు చెల్లించుట

 

"స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను" - కీర్తనలు 50:23

 

అమెరికాలో నేరము చేసిన ఒక ఆయనకు 50 సంవత్సరాలు చెరసాలలో శిక్ష విధించబడింది. ఇందువలన ఆయన భార్య పిల్లలు అనేక సంవత్సరాలు మిక్కిలి కష్టముల గుండా వెళ్లారు. అందు నిమిత్తము ఆయన మిక్కిలి కోపముతో ద్వేషముతో ఉండేవాడు. ఆ కోపమును ద్వేషమును తనతో ఉన్న వాళ్ళ పైన చూపించడం ప్రారంభించాడు. ఒక దినము తన గదిలో ఉన్న బైబిల్ ని తీసి చదువుతూ ఉండగా దేవుని సమాధానము ఆయన హృదయములోనికి నింపబడింది. క్రీస్తు ఏ పాపము చేయకుండా నా కొరకు శ్రమపడి మరణించారే అని ఆయన అంగీకరించారు. ఆ దినం మొదలుకొని తనకు రావలసిన శిక్షను దేవుడే తన మీద వేసుకున్నారే అని కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించారు. కొన్ని దినాలు గడిచాయి. ఆయన భార్యకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా సోలిపోకుండా కృతజ్ఞతలు చెల్లించాడు ఆయన భార్య స్వస్థపరచబడి ఆయనను చూచుటకు వచ్చారు. ఎంత అద్భుతం చూడండి. 

 

మనము సనుగు కొంటూ ఉన్నప్పుడు సాతానికి చోటిస్తూ ఉన్నాం. స్తుతించినప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన హెచ్చిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగము అరణ్యంలో దేవుని చేత మోషే ద్వారా నడిపించబడినప్పుడు వాళ్లు మార్గమధ్యంలో కష్టములు అనుభవించినప్పుడు సనుగుకుంటూ నేరము మోపుతూ ఉన్నారు. బానిసత్వంలో నుండి దేవుడు వారిని విడిపించిన దానిని తలంచి వారు దేవుని మహిమ పరచలేదు అందువల్ల వారు కానానును కోల్పోయారు. వాళ్ళ యొక్క పిల్లలే దానిని స్వతంత్రచుకున్నారు. మారుగా స్తుతించేటప్పుడు దేవుడే దిగివస్తున్నారు. ఇశ్రాయేలు దేవుని స్తుతించినప్పుడు యెరికో కోట గోడలు కూల్చబడ్డాయి. సనుగుకున్నప్పుడు దేవుని యొక్క కోపము పతనము వారిపై వచ్చింది. అవును మనం స్తుతించేటప్పుడు దేవునికిని సనుగుకొనెటప్పుడు సాతనుకు ప్రాధాన్దిస్తున్నాం. మనం ఎవరికీ ప్రాధాన్యత ఇస్తున్నాము దానిని బట్టి మన జీవితము ఉంటుంది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనము శ్రమలు, కష్టాలు మధ్యలో ఉన్నప్పుడు స్తుతించకుండా చదువుకుంటూ నేరము మోపుతూ ఉండవద్దు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను మరిచిపోకుండా కృతజ్ఞత గలవారముగా ఉండి స్థితులు చెల్లిస్తూ ఉంటే మన హృదయము స్తుతులతో నిండిపోతుంది. అభ్యంతరాలు వచ్చినప్పుడు స్తుతుల ద్వారా దానిని జయించి మనం ముందుకు నడవగలం. స్తుతులు మన నోటిలో ఎప్పుడు ఉండనివ్వండి. స్తుతి ఉండిన యెడల పరలోకం మీ వద్దకు దిగివస్తుంది మీరు ఉన్నచోట కదిలించబడుతుంది. పరిస్థితులు మార్చబడతాయి. ఇష్టపడి దేవుని స్తుతించుడి అది మీకు అలవాటుగా మారిపోతుంది.

- శ్రీమతి. జనిత అభిరామి 

 

ప్రార్థన అంశం: 

మన క్యాంపస్ లో ట్యూషన్ చెప్పడానికి వస్తున్న టీచర్లు రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet