Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.07.2023
Share:

By Village Missionary Movement

Saturday, 22-Jul-2023

దిన ధ్యానము(Telugu) 22.07.2023

 

అంశం: అడుగుడి మీకు ఇవ్వబడున

 

"అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును" - లూకా 11:9

 

దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన దృఢమైన వాగ్దానములను ఇచ్చి ఉన్నారో చూడండి. అది మూడు విధమైన దృఢత్వాన్ని మనం దేవుణ్ణి ఎలా అడగాలి అనేదాన్ని క్లుప్తంగా రాసి ఇచ్చి ఉన్నారు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే ఈ వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన మాట తప్పనివాడు. మనుషులు మనకి ఇచ్చిన వాక్కును మాటను మర్చిపోవచ్చు కానీ మన యేసుక్రీస్తు ఎన్నడూ మాట తప్పనివాడుగా ఉన్నారు. 

 

మొదటిగా:

అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును:

 మనము పసిపిల్లలుగా ఉండేటప్పుడు మన తల్లి మనం అడగకుండానే సరైన సమయంలో ఆహారం తినిపిస్తూ ఉండేది. అలాగే ప్రభు కూడా మనం అడుగుకుండానే అనేక ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎదిగిన తర్వాత మనము అడుగుతున్నప్పుడే తల్లి ఆహారం ఇస్తున్నారు. అలాగే మనము కొన్ని అవసరతలు గురించి మన ప్రభువుని అడగాలి అని ప్రభువు ఎదురుచూస్తున్నారు. 

 

రెండవదిగా:

వెదకుడి అప్పుడు కనుకొందురు:

 ఒకమారు ఒక కొత్త చెవులు రింగ్ పెట్టుకొని ఒక ఫంక్షన్ కి బస్సులో వెళ్లాను. ఎలాగో ఒకలాగా ఒక చెవి రింగ్ ఊడిపోయి బస్సులో పడిపోయింది. దిగిటకు ముందు చెవులో రింగ్ లేదు అని నేను కనుక్కొని వెంటనే వెతికాను. మంచిగా బస్సులోనే అది దొరికింది. దాన్ని మరల కనుగొన్నప్పుడు నా హృదయం సంతోషముతో నిండిపోయింది. పోగొట్టుకున్న స్థలంని విడిచి బస్సు బయట వెతికి ఉంటే దొరకదు. అలాగే ఆలస్యం చేయకుండా తగిన సమయంలో తగిన స్థలములో వెతికేటప్పుడు కోల్పోయిన సంతోషాన్ని దేవుని ప్రసన్నతను మరల పొందుకుంటాం . 

 

మూడోదిగా:

తట్టుడి అప్పుడు మీకు తీయబడును: 

నా కుమార్తె కాలేజీ చదువుకు కొద్ది డబ్బులు అవసరమైనప్పుడు దేవుని పైన మాత్రమే ఆనుకొని ఆయన తలుపును కొట్టి వేచి ఉన్నాను. ఎదురు చూడని స్థలం నుండి ధనము మాకు వచ్చింది. దేవుడు నా అవసరతను తీర్చారు. బైబిల్లో కూడా యోసేపు దేవుని నమ్మి దేవుని మీద నమ్మకం ఉంచినప్పటికీ తనను చెర నుండి విడిపించాలని ఆ అధికారి సహాయము చేస్తాడు అని ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ అధికారి అయితే యోసేపును మర్చిపోయాడు. దేవుడు అయితే తగిన కాలంలో యోసేపును విడిపించి ఐగుప్తుకు అధికారిగా హెచ్చించారు. కాబట్టి మనుషులను నమ్మకుండా ప్రభువునే తెరి చూద్దాం. ఎందుకంటే ఎవరైతే తట్టుతున్నారో వాళ్ళకి ద్వారము ఎప్పుడు తెరవబడే ఉంటుంది అని విశ్వసించి దీవెనలు మనం పొందుకుందాం. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధనబాలన్ గారు 

 

 ప్రార్థన అంశం:

 మన పార్ట్నర్షిప్ మిషనరీలు పరిచర్య చేస్తున్న పరిచర్యలో దేవుని హస్తం తోడుగా ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al