Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.07.2023
Share:

By Village Missionary Movement

Thursday, 20-Jul-2023

దిన ధ్యానము(Telugu) 21.07.2023

 

అంశం: మార్పు ఎంత

 

“యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు” - యోహాను 14:6

 

పరలోకపు మార్గం ఇరుకైనది అనే కార్యాన్ని వివరించే ఒక కల్పనా కథ. ఒక మనిషి మరణించి పరలోక ద్వారమునకు వెళ్ళడు. అక్కడ పేతురు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. పేతురు అతనితో 100 మార్కులు పొందుకున్న యెడల పరలోకానికి నువ్వు రావచ్చు. కాబట్టి నువ్వు చేసిన మేలులు చెప్పుము నేను నీకు మార్కులు వేస్తాను అని అన్నారు. ఆ మనుష్యుడు సంతోషముతో నేను ఒకే భార్యతో 50 సంవత్సరాలు జీవించాను. మనసులో కూడా ఆమెకు ద్రోహం చేయలేదు అని అన్నాడు. అందుకు పేతురు ఓహో చాలా మంచిది దీనికి మూడు మార్కులు అని చెప్పారు. ఆ మనుష్యుడు మేము ప్రతి వారము తప్పకుండా చర్చికి వెళ్లే వాళ్ళము. దశమ భాగము తప్పకుండా ఇచ్చేవాళ్ళము అని అన్నాడు. అందుకు పేతురు చాలా మంచిది దీనికి కూడా మూడు మార్కులు అని అన్నారు. ఆ మనిషి వృద్ధులకు సహాయం చేశాను అని అన్నాడు పేతురు సంతోషంతో మూడు మార్కులు అని అన్నాడు. ఆ మనిషి ఏడవడం ప్రారంభించాడు. నేను చేసిన మేళ్లకు ఇంతేనా మార్కులు అని విలపిస్తూ నేను నా క్రియల ద్వారా పరలోకానికి వెళ్ళనే వెళ్ళలేను దేవుని కృప ద్వారా మాత్రమే నేను వెళ్ళగలను అని గట్టిగా అరిచాడు. దానిని విన్న పేతురు నీవు లోపలికి వెళ్ళవచ్చు అని అన్నాడు. 

 

అపోస్తులుడైన పేతురు యూదులకు మాత్రమే రక్షణ అని తలంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. యూదులు కానీ కొర్నేలీని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇటలీ పట్టణమందు కొర్నేలీ మరియు ఆయన ఇంటి వారందరితో దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారు. ప్రజలకు దానధర్మాలు చేసేవాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, పెద్ద పదవిలో ఉన్నప్పటికీ భక్తిపరుడు గాను, ప్రార్థించేవాడుగాను, దానధర్మాలు చేసేవాడు గాను ఉన్నప్పటికీ ఆయనకు రక్షణ అవసరము అని పేతురు ద్వారా గ్రహించాడు. 

 

అవును నా ప్రియమైన వారులారా! ఎంత అధికమైన సత్క్రియలు మనం చేసినప్పటికీ యేసుని రక్షకునిగా అంగీకరించి పాపం నుండి విడుదల పొందుకొని సాక్షి కరమైన జీవితము జీవించని ఎడల నిత్యము మనకు అది అందని ఫలముగానే ఉంటుంది. రక్షణ అనుభవంతో సత్క్రియలు చేసేవారు ప్రయాసవలన దేవుడు మహిమ పొందినవాడిగా వచ్చేటప్పుడు ఇస్తాను అన్నదాన్ని అందుకోలేము. యేసుక్రీస్తు తన ప్రేమ వలన మనకు దాన్ని అనుగ్రహిస్తున్నారు. క్రీస్తు నందు మన సత్క్రియలను ఫలితాలు తీసుకుని వస్తాయి. చివరకు ఆయన వలన మనకు నిత్య జీవము కూడా కలదు మీ పరుగు క్రీస్తులో ఉందా లేదా క్రీస్తు బయట ఉందా ఆలోచిద్దాం. 

- సహోదరి. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:

కరపత్రికల పరిచర్య ద్వారా దర్శింపబడుతున్న వ్యక్తులు రక్షింపబడే లాగానే ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet