Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.07.2023
Share:

By Village Missionary Movement

Thursday, 20-Jul-2023

దిన ధ్యానము(Telugu) 20.07.2023

 

అంశం: ఏసు కొరకు

 

"బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను" - 1 కోరింథీయులకు 9:22

 

సదన్ ఫ్యాక్టర్ సెమినరీలో ప్రొఫెసర్ గా ఉండిన వ్యక్తి బోధకుడు రాబర్ట్ స్మిత్. ఆయన క్లాసులో థియాలజీ చదవడానికి ఒక విద్యార్థి ఆఫ్రికా దేశం నుండి మిషనరీగా అందరితో పరిచయం చెసుకొనుటకు వచ్చారు. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజన సమయం వచ్చింది. ఆమె తనకు ఒక ప్లేట్ ను ఇస్తారని తలచింది కానీ అలా ఇవ్వలేదు. వారందరూ టేబుల్ మీద ఒక పెద్ద పాత్రను తీసుకొని వచ్చి పెట్టారు. దానికి కమ్యూనిటీ పాత్ర అనే పేరు. అందరూ ఆ పాత్రలో చేయి పెట్టి తీసి తిని తినడం మొదలుపెట్టారు. ఈ మిషనరీ మిక్కిలి నాగరికత గల ప్రాంతం నుండి వచ్చినందున ఆ పాత్రలో చేయి పెట్టి తినుటకు భయపడింది. మరియు దానిలో తిన్న వారెవరు కూడా చేయి కడుక్కొలేదు. మిషనరీకి ఆ పాత్రలో ఎలాంటి ఆహారం ఉన్నదో కూడా తెలియదు. ప్రసంగం చేయాలంటే వారికి యేసు ప్రేమను ప్రకటించాలంటే ఆమె కచ్చితంగా ఈ పాత్రలో చేయి పెట్టి తిని తీరాల్సిందే అని అర్థం చేసుకొని తినడం ప్రారంభించింది.

 

నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను. యెషయా 43:4లో చదువుతున్నాం. గోధుమ గింజ నేలలో పడి చావకుండిన యెడల ఒంటరిగా ఉండును చచ్చిన యెడల మిక్కిలి ఫలితాన్ని ఇస్తుంది అని యేసు చెప్తున్నారు (యోహాను 12: 24). సువార్త పరిచర్యలో మన ప్రాణం ఇచ్చే విధంగా పరిచర్య చేస్తున్నామో లేదో కానీ మనం చిన్న చిన్న త్యాగాలను కచ్చితంగా చేసే తీరాలి. అది మనకు సహించలేని విషయంగా కూడా ఉండవచ్చు కానీ సువార్త నిమిత్తము అనేక కార్యాలలో మనము త్యాగం చేయాల్సిన అవసరత ఉన్నది. 

 

ఆత్మల రక్షణ అనే మార్గము కొద్దిగా సులువైన మార్గమే కానీ దాంట్లో కఠినమైన ప్రయాసలు ఉన్నాయి. ఒక వ్యక్తిని క్రీస్తు చెంతకు నడిపించినందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటేనే దాని ఫలితాన్ని చూడగలం. సమరయ స్త్రీ కి సువార్త చెప్పినప్పుడు యేసు తనకుండిన దాహాన్ని దప్పికను భరించి సువార్తను ప్రకటించారు. కఠినమైన ప్రయాస ఉంటేనే తప్ప మనం పరిచర్యలో మంచి ఫలితాన్ని చూడలేం. 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్ధన అంశం:

"తిరుచిలో జరగబోతున్న ఉజ్జీవపు ప్రార్థన కట్టడం పనులు కొరకు ప్రార్థిద్దాం".

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet