By Village Missionary Movement
Tuesday, 16-Mar-2021అనుదిన ధ్యానము:-16-03-2021
పాత మూట.
" వెనుక ఉన్నవి మరచి(లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు". (ఫిలిప్పీయులకు 3: 13)
ఒక రాజు తన భవనంలో గొప్ప విందు సిద్ధపరచి ప్రకటించారు. రాజుల వస్త్రం ధరించిన వాళ్ళు మాత్రమే ఈ విందులో పాల్గొనాలి అని ప్రకటించారు. దీనిని గమనించిన ఒక బిక్షగాడు ఎలాగైనా ఆ విందులో పాల్లోనాలి అని ఆ రాజా వస్త్రం గురించి ఆలోచించాడు. రాజు యొద్ద ఒక పాత వస్త్రం అడగాలి అని నిర్ణయించుకున్నాడు. ఏదో విధముగా ప్రయాసపడి రాజును కలిసి పాత రాజ వస్త్రం అడిగి తీసుకున్నాడు. విందు సమయం వచ్చినప్పుడు ఆ రాజ వస్త్రం దరించుకొన్న బిక్షగాడు గంభీరంగా నడుస్తున్నడు. కాని తన పాత బట్టల మూట కూడా మోసుకొని తిరుగడం ప్రారంభించాడు. అందువలన ఆ విందులో అనుమతించబడలేదు. ఆ బిక్షగాడు తన యొక్క మరణం వరకు రాజ వస్త్రం దరించుకున్నాడు వాటితో పాటు తన పాత వస్త్రములను కూడా తనతో పాటు ఉంచుకొనే మరణించాడు.
పరిశుద్ధ లేఖనానుసారంగా దేవుడు మన పాపములను క్షమించివేశారు. మనకు నూతన జీవితమును దయచేశారు. కాని మనము అయితే ఆయన ఇచ్చిన జీవితం యొక్క మహోన్నతను గ్రహించకుండ పాపపు మూటను మోసుకొనే తిరుగుతున్నాం. సాతానుడు ఈ అవకాశమును వాడుకొని మనలను నిరుత్సాహ పరుస్తున్నాడు. అయ్యో పరిచర్య చేయుటకు నాకు అర్హత లేదే అని నేను ఒక పాపిని అని చెప్పి మనలను పని చేయలేని వారముగా ఉంచేస్తున్నారు. ఈ విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి.
ప్రియమైన వారలారా! ఈ దినము మనలో అనేకులు తమ పాత జీవితపు పాపపు మూటను మోసుకొనే తిరుగుతున్నాం. కొందరు అయితే ధనాఆశ అనే మూటతో, మరికొందరు దురాశ అనే మూటతో, మరికొందరు గర్వము అనే మూటతో ఇలాగు అనేక పాపపు మూటలు కలవు. దేవుని చేత రక్షించబడిన మనము రాజు యొక్క వివాహపు విందులో పరలోక రాజ్యానికి పాలిబాగస్తులము. ఆ ఉన్నత మహిమను గ్రహిస్తాం. పాత పాపములు చేత ఏర్పడిన బారమును విడిచిపెడదాం. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటివైపు దృష్టి ఉంచుదాం.
శ్రీమతి. జ్యోతి ఆనంద్
ప్రార్థన అంశం:-
రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజీలో నూతనంగా జాయిన్ అయిన విద్యార్థుల గురించి ప్రార్థిద్దాం.
తమిళ్ కొరకు +91 9444011864, ఇంగ్లీష్ కొరకు +91 8610984002 , హిందీ కొరకు +91 9385810496 , తెలుగు కోసం+91 9442493250.
ఈమెయిల్: dailydevotion@vmm.org.in Androidapp: https://play.google.com/store/apps/details?id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 9442493250.