Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.07.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 19-Jul-2023

దిన ధ్యానము(Telugu) 19.07.2023

 

అంశం: వృద్ధులను ఘనపరచుడి

 

"నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును" - సామెతలు 16:31 

 

శ్రీమతి స్టేక్ బస చేసి ఉన్న ఒక నర్సింగ్ హోమ్ లో గ్లారీ అనే ఒక తల్లి కూడా ఉండేవారు. గ్లారీ తన తల్లిని చూచుటకు వచ్చినప్పుడల్లా శ్రీమతి స్టేక్ మిక్కిలి ఆసక్తితో ఆ హాల్లో ఉన్న కుర్చీలో చక్కగా కూర్చుని వస్తూ వెళుతున్న వారిని చూస్తూ ఎవరైనా తనతో కూర్చుని మాట్లాడతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. గ్లారీ హలో అని ఆ తల్లితో చేయి ఊపి దాటిపోయేవారు. ఆ తల్లి ఒంటరితనములో మరువబడినదానిగా ఉండటం గ్రహించి తన కనికరము లేని నడవడికను గుర్తుతెచ్చుకొని దుఃఖపడి ఒక దినము ఆమె వద్దకు వెళ్లి కూర్చుని మాట్లాడారు. 

 

మాట్లాడటం ప్రారంభించిన వెంటనే శ్రీమతి స్టేక్ తాను పసిప్రాయం లో జర్మనీలో నివసించిన దాన్ని వివాహమైన ఆ కొత్త జీవితాన్ని అలానే వారిలో ఉన్న నూతన ఉత్సాహాన్ని వివరించారు. తాను పియానో వాయించే విధానాన్ని, ఆ థియేటర్లో జరిగిన ప్రోగ్రాంలో అన్నింటినీ గురించి ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండేవారు. గ్లారీ తరచుగా అనుదినము ఆమెతో మాట్లాడి సంతోషపరిచేవారు. తన జీవితంలో ఎన్నో దుఃఖాలు ఏర్పడినప్పుడల్లా దేవుడు ఆదరణగా ఉన్నారు అనే సాక్ష్యాన్ని చెప్పి గ్లారీ కన్నీరు కార్చేవారు. 

 

గ్లారీ ఆ తల్లితో మాట్లాడుట ఆదరణ ఇస్తుంది అని అనుకున్నది కానీ అది శ్రీమతి స్టేక్ నుండి అనేక అరుదైన కార్యాలను గ్లారీ నేర్చుకుంది. ప్రతి వృద్ధులలో అనేక అద్భుతమైన జీవిత కార్యాలు, విలువైన సంఘటనలు ఎక్కడ కనుగొనలేని నిధులు నిండి ఉంటాయి అనేదాన్ని గ్రహించింది. 

 

ప్రియమైన వారలారా! మనం ప్రస్తుతం వృద్ధులను తిరస్కరిస్తున్న కాలంలో జీవిస్తున్నాం. పూర్వకాలంలో అని ప్రారంభించి కథ చెప్పేవారు అని హేళన చేస్తున్నాం. వృద్ధులను తిరస్కరించకు అని బైబిల్ చెప్తుంది. వాళ్లపైన దేవుడు కనికరము కలిగి ఉన్నారు. కుటుంబంలో ఉన్న వృద్ధులను ఘనపరిచే అవసరమైన పనులను వారి కొరకు చేసిపెట్టి వారితో సమయం గడపాలి. అప్పుడు మనము అనేక అద్భుతమైన వెలకట్టలేని జీవిత కార్యాలను నేర్చుకుంటాం. 

 

ప్రార్థన:

సర్వశక్తి కలిగిన ప్రభువా వృద్ధులను తిరస్కరించకుండా వారిని గౌరవించుటకు సహాయం చేయండి. వారి యొక్క గడచిన కాల అనుభవాన్ని శ్రద్ధగా విని నేర్చుకొనుటకు ప్రయత్నం చేయండి. ఆమెన్! 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:

7000 మంది మిషనరీలు, లక్ష గ్రామాలు అనే దర్శనమును మనం చేరుకొనుటకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al