By Village Missionary Movement
Monday, 17-Jul-2023దిన ధ్యానము(Telugu) 18.07.2023
అంశం: బల్లి చేయగలిగినప్పుడు
"నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను" - మత్తయి 19:19
ఇది జపాన్ లో జరిగిన నిజ సంఘటన. అక్కడ ఉన్న ఒక అతను తన ఇంటిని బాగు చేయుటకు చెక్కతో చేయబడిన గోడను తీస్తూ ఉన్నాడు. జపాన్ దేశంలో ఇల్లు సాధారణంగా చెక్కతో చేయబడి ఉంటాయి. రెండు చెక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలము మధ్యలో చిక్కుకొని ఉన్న ఒక బల్లి చూశాడు. అది ఎలా చిక్కుబడిపోయింది అని ఆ బల్లి చుట్టూరా చూసినప్పుడు ఆ బయట భాగంలో దాని కాళ్ళకు ఒక మేకు కొట్టబడి ఉన్నది. ఆశ్చర్యకరమైన కార్యమేమిటంటే ఆ మేకు కొట్టబడి మూడు సంవత్సరాలు అయి ఉంటుంది. ఎలాగు ఈ బల్లి ప్రాణముతో ఉండగలుగుతుంది దీన్ని మనం కనిపెట్టాలి అని పని మానేసి ఆ బల్లిని గమనించడం ప్రారంభించాడు.
కొంత సమయం తర్వాత మరియొక బల్లి దాని దగ్గరికి రావడం చూశాడు. ఆ బల్లి తన నోటితో ఆహారం తీసుకువచ్చి ఈ బల్లికి తినిపించడం చూశారు. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. మూడు సంవత్సరాలుగా గోడకు చిక్కబడి ఉన్న తన తోటి బల్లికి ఆహారం ఇస్తూ వస్తుంది. ఒక బల్లి తన తోటి బల్లిని కాపాడుటకు తన ప్రాణానికి విలువను ఇచ్చి ఏమి ఆశించకుండా మూడు సంవత్సరాలు ఆహారం ఇచ్చుట చూసి ఆశ్చర్యపోయాడు.
ఈ దినము మన చుట్టూ ఉన్న ప్రజలు సమస్యలు మరియు పేదరికంలో చిక్కుబడి జీవించుటకు మార్గము తెలియక ఎంతోమంది ఉంటున్నారు. అందులో మన బంధువులు కూడా అనేకమంది ఉంటున్నారు వారి యొక్క పరిస్థితి గ్రహించి చూసి చూడనట్లు ఉంటూ సహాయము చేయుటకు వెళ్లకుండా ఉంటున్నాం. మనము చేయడానికి మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు చేయకపోవడం కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది.
ఒక బల్లి చేయగలిగినప్పుడు మనము చేయకూడదా? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమించుము అని బైబిల్ మనకు నేర్పిస్తున్న మాట మనం యెరిగియున్నాము కదా! కాబట్టి వాక్యానికి లోబడదాం సాక్షిగా జీవిద్దాం.
- శ్రీమతి. జయంతి భాగ్యనాధన్ గారు
ప్రార్థన అంశం:-
మన క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250