By Village Missionary Movement
Monday, 17-Jul-2023దిన ధ్యానము(Telugu) 17.07.2023
అంశం: నేరం మన మీదకు వస్తుంది
"నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ" - 1కోరింథీయులకు 9:16
జర్మనీ దేశంలో సర్వాధికారిగా పరిపాలించిన హిట్లర్ గురించి మనమందరము బాగా ఎరుగుదము. యూదులను చంపి ఒక్క యూదుడు కూడా లేకుండా చేయాలి అని కుయుక్తితో పనిచేసేవాడు. యూదులను పట్టుకొని చాలా క్రూరముగా నడిపించి సెల్ అనబడిన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి స్త్రీలను పురుషులను కొట్టి గాయపరిచి తలకిందులుగా వేలాడదీసి చంపేసేవాడు. ఆ హిట్లర్కు ఆండ్రు అని పేరు కలిగిన క్రైస్తవుడు ఒకరు ఉన్నత అధికారిగా హిట్లర్ కు దగ్గరగా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఏ దినము కూడా హిట్లర్కు యేసుక్రీస్తు గురించి చెప్పలేదు చెప్పుటకు మిక్కిలి భయపడెను.
ఈ పరిస్థితిలో జర్మనీకి వ్యతిరేకంగా అనేక దేశములు కూడుకొని యుద్ధానికి వచ్చినప్పుడు హిట్లర్ దేశాన్ని విడిచి విమానం ద్వారా తప్పించుకొని వెళ్లిపోయి మరణించాడు. ఆయన స్నేహితుడైన ఆండ్రూ తన పనిని పూర్తిచేసుకుని విశ్రాంతి పొందుకొని తన కుర్చీలో కూర్చుని బైబిల్ చదువుతూ ఉన్నారు. అప్పుడు ఆయన వెనుక భాగములో హిట్లర్ యొక్క బూట్ల శబ్దము వినబడింది. ఆయన దానిని విని వణికిపోయాడు. ఆ శబ్దము ఆయనకు దగ్గరకు వచ్చి నిలబడింది. తర్వాత ఆ రూపం ఆండ్రూ నీవు నన్ను మోసగించావు నువ్వు మాత్రం నాతో నీవు ఆరాధించిన యేసయ్య గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు అని దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ మరుగై పోయింది. ఆ దినము ఆండ్రు తాను చేసిన తప్పిదములను తలంచుకొని మిక్కిలి దుఃఖపడ్డారు.
ఎలీషా ప్రవక్త దినములలో ఇశ్రాయేలు దేశంలో మిక్కిలి కరువు ఏర్పడింది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితికి సిరియా రాజ్యం వాళ్ళని కట్టడి చేసింది. కరువు చాలా కఠినముగా ఉన్నందున ఊరి బయట ఉండిన నలుగురు కుష్టి రోగులకు ఎవరు ఆహారము ఇచ్చుటకు ముందుకు రానందున సిరియా సైన్యము దగ్గరికి వెళ్లడానికి వారు సిద్ధపడ్డారు. అప్పుడు అక్కడ పరిస్థితి వాళ్లను బ్రమ పడే విధముగా చేసింది. వీళ్ళకు ముందు సిరియా సైన్యం తమ పాలెం విడిచి పారిపోయి ఉన్నారు. నలుగురు కుష్టి రోగులు కూడా కడుపునిండా తిని వారు ఒకరుకొకరు చూసుకుని మనం చేస్తున్నది న్యాయం కాదు. ఈ దినము సువార్త ప్రకటించే దినం మనము మౌనంగా ఉంటే ఈ నేరం మన మీదకు వస్తుంది అని అనుకున్నారు. (2 రాజులు 7:9)
మీరు కూడా నన్ను యేసయ్య దర్శించి, మనల్ని రక్షించి, కాపాడి నడిపిస్తూ వస్తున్న ఆయన మిమ్మల్ని రక్షించిన విధానాన్ని ఇతరులకు చెప్పాలి. నాకు సదుపాయం గల కాలం వచ్చినప్పుడు వేచి ఉండి అప్పుడు చెప్తాను అని చెప్పి మనం పని చేయకుండా ఉంటే నేరం మన మీదకి వస్తుంది. ఆలోచిద్దాం వెంటనే ప్రయాస పడదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్!
- బ్రదర్. భాగ్యనాధన్ గారు
ప్రార్థన అంశం:-
ఆకలి గల వారికి ఆహారం ఇచ్చే పరిచర్యలో దర్శింపబడుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250