Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.07.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 16-Jul-2023

దిన ధ్యానము(Telugu) 16.07.2023 (Kids Special)

 

అంశం: చక్కెర బస్తాలు

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును" – గలతియులకు 6:7

 

ఒక గ్రామంలో ముత్తయ్య అనే చెక్కెర వ్యాపారి ఒకరు ఉండేవారు. ఈయన పక్క ఊరుకు వెళ్లి చెక్కెర వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించేవాడు. ఈయనకు సహాయముగా గాడిద ఒకటి ఉండేది. రోజు ఆ గాడిద ఆ చెక్కెర బస్తాలను కష్టపడి మోస్తూ వచ్చేది. వచ్చే మార్గంలో ఒక నది దాటుకొని రావాల్సి ఉంది. ఒక దినము నదిని దాటేటప్పుడు కాలు మడతబడి గాడిద నదిలో పడిపోయింది. తడిసిపోయిన చక్కర నీటిలో కరిగిపోయింది. గాడిదకు మోయుటకు సులభమైంది. దీనిని గ్రహించిన గాడిద రోజు ఈ నది నీటిలో పడిపోతే మంచిది అని చెప్పి ప్రతిరోజు ఆ నదిని దాటేటప్పుడు కాలు జారినట్లు కావాలనే ఆ నదిలో పడిపోయేది. వెంటనే ఆ చెక్కెర కరిగిపోవడం వలన భారం తగ్గేది. దీనిని గమనించిన ముత్తయ్య ఈ గాడిదనకు ఎలాగైనా గుణపాఠము చెప్పాలి అని అనుకున్నాడు. 

 

ఒక దినము చెక్కెరకు బదులుగా దూదిని మూటగా చేసి గాడిద మీద పెట్టాడు. అబ్బా చాలా బాగుంది చాలా సులభంగా ఉంది అని నడుచుకుంటూ వెళుతుంది గాడిద. ఎప్పటి వలె నదిని దాటవలసి వచ్చింది కాలుజారి పడినట్లు పడింది. ఆ దూది నీటిలో తడిసిపోయేసరికి బరువు ఎక్కువైంది. గాడిద లేవలేకపోయింది చాలా తడబడుతూ లేచి నిలబడి చాలా బరువుతో నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. నేను నా యజమానుని మోసగించినందువలన నాకు దొరికిన శిక్ష అని తలచుకొని మెల్లగా నడుచుకొని ఇంటికి చేరుకుంది. అయ్యో ఇలాంటి జీవితం ఎప్పుడూ నేను జీవించలేదు. నేను ఆయనను మోసగించినందుకు ఇదే నాకు సరైన పాఠము అని చింతించింది. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి ఇతరులను మోసగించాలి అనుకుంటే మనం ఒకరోజు మోసగించబడతాం. హోంవర్క్ చేయకుండా తల్లిదండ్రులను, టీచర్లను మోసం చేయాలి అనుకుంటే మీరే మోసపోతారు. పరీక్షలలో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రారంభం నుండే చక్కగా చదివి ఎవరిని కూడా మోసం చేయకుండా మంచి పిల్లల వలె యేసయ్యను సంతోషపరచాలి. బాయ్ పిల్లలు! 

- శ్రీమతి. జీవ విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al