By Village Missionary Movement
Friday, 14-Jul-2023దిన ధ్యానము(Telugu) 15.07.2023
అంశం: శ్రమల మధ్యలో నా ఫలితం
"దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము" - కీర్తనలు 139:23
2003 వ సంవత్సరము జూన్ నెల 5వ తారీకు చెన్నై రామచంద్ర హాస్పిటల్ లో నా రెండు కాళ్లు కూడా చర్చబడినట్లు నా కుటుంబీకులు గ్రహించి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అనేక పరీక్షలు తర్వాత చివరగా నా రోగం యొక్క పేరును చెప్పారు ట్రాన్స్ వేస్ మైలిటిస్ అన్నది నా రోగం. వెన్నెముకలో అడుగుగా ఉన్న ఎముకలలో మధ్యలో ఉంటున్న నీరాన్స్ అనే భాగంలో వైరస్ ఉండడం వలన మెదడుకు వెళ్లే నరాలలో స్పర్శ లేకుండా పోయింది. కాలు యొక్క ప్రతిస్పందనను మెదడు గ్రహించలేకపోయింది. మెదడుకు మరియు నడుము భాగమునకు ఏమి సంబంధం లేకుండా చచ్చుబడిపోయేటట్లు చేసింది ఆ రోగం.
నేను రక్షింపబడిన ఆ ప్రారంభ దినాలలో అనగా 12వ సంవత్సరంలో పరిశోధన కొరకు సమయాన్ని కేటాయించే దానిని కానీ ఇప్పుడు 27 నుండి 30 సంవత్సరాలు నా వివాహ జీవితం కుమారుడు, భర్త అని నా ఆత్మీయ జీవితాన్ని గుడ్డితనముగా చేసేసుకున్నాను. దీనితోపాటు అప్పుడప్పుడు సనుగు కొనడం, అసంతృప్తి, వ్యతిరేకమైన కార్యాలు అనే అనేక కార్యములకు అలవాటు పడిపోయి దేవుని ప్రణాళికను గ్రహించకుండా ఉండిపోయాను. కానీ ఇప్పుడైతే శ్రమలే నాకు పాఠశాలగా మారాయి. సమయం లేదు ప్రభువా అని చెప్పిన నాకు దేవునితో సమయం కేటాయించుటకు మరి ఎక్కువగానే సమయం దొరికింది. వైద్యులు నాకు చేయవలసిన వైద్యమును ముగించి ఇక కాళ్లకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది నడుచుట మీ బాధ్యత అని చెప్పి పంపించారు. అయినప్పటికీ మంచమే ఇంకా నా స్థానం అయిపోయింది. రోగం యొక్క కారణము ఏ వైరస్ వచ్చిందో అది ఎందుకు మనకు వచ్చిందో నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను కూడా ఇంటికి వచ్చి చేరుకున్నాను.
నా కనులు రాత్రింబవళ్లు పరలోకంలో ఉండే దేవుని వైపు సహాయము కొరకు ఎదురుచూస్తూ ఉండేవి. స్తుతించుట నా సంపూర్ణ పనిగా మారింది. ఇతరుల యొక్క సహాయముతో నడుచుటకు నాకు దేవుడు కృప చూపించారు. విశ్వాసంతో లేచి నడవడం ప్రయత్నం చేశాను. నాకు నేనే కొన్ని గమ్యములను పెట్టుకొని నడిచి ప్రయత్నం చేశాను కానీ అనేకసార్లు క్రింద పడ్డాను. నా దేవుణ్ణి నన్ను బలపరచండి అని ప్రార్థించాను. దేవుడు కనికరించి అద్భుతం చేశారు. ఈ దినము నా పనులు అన్నింటినీ నేను చేయగలుగుతున్నాను.
అవును మనలను చేదుగా మార్చుటకు కాదు గొప్పవారీగా చేయుటకు మనకు సమస్యలు వస్తున్నాయి. ఆ లోతైన సముద్రంలో దేవుడు మనలను తీసుకువెళ్తా విడిచి పెట్టేవాడు కాదు. శ్రమలు అనేవి మనలను పరిపక్వత గలవారీగా మార్చుటకు అని ఎక్కడో చదివాను. శ్రమలు ఉండవచ్చు కానీ అది నిత్యమైనవి కావు. శ్రమను కలిగించే పనులు దేవుని హస్తంలో ఉన్నవి కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉందాం. ఆమెన్. హల్లెలూయ!
- శ్రీమతి. బెర్లిన్ స్టెల్లా బాయ్ గారు
ప్రార్థన అంశం:-
ఫీల్డ్లో హాస్పిటల్ మినిస్ట్రీలో దర్శింపబడుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250