By Village Missionary Movement
Friday, 07-Jul-2023దిన ధ్యానము(Telugu) 07.07.2023
అంశం: మహానష్టం
"ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా" - హెబ్రీయులకు 13:5
ఒక మనిషి తన చిన్న పడవలో సాధారణంగా చేపలు పట్టి కుటుంబం నడిపిస్తూ వచ్చేవాడు. ఒక దినము ఆ పడవలో పెద్ద చేప ఒకటి చిక్కుకుంది. కానీ ఆ చిన్న పడవ ద్వారా ఆ పెద్ద చేపను ఒడ్డుకు తీసుకు రావడం కష్టం అయినప్పటికీ అత్యాశ వలన ఆ పెద్ద చేపను ఆయన ఒడ్డునకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అది చాలా కష్టంగా ఉన్నందున చాలా సేపు ప్రయాసపడి అలసిపోయాడు. చివరికి వేరే దారిలేక దానిని వలతో సముద్రంలో విడిచిపెట్టి ప్రాణమును కాపాడుకొంటూ సముద్రపు ఒడ్డునకు చేరుకున్నాడు. యధావిధిగా దొరికే చిన్న చేపలు కూడా ఆయనకు దొరకలేదు. ఆయన పని ఆ దినమంతా నష్టం అయిపోయింది.
దేవుని ప్రణాళిక ద్వారా అబ్రహముతొ బయలుదేరిన లోతు యొక్క హృదయంలో పెద్ద పెద్ద ఆశలు వచ్చాయి. కాబట్టి అబ్రహాముతో మంచి బంధాన్ని కోల్పోయాడు. దాని యొక్క ప్రభావము ఆస్తులను హెచ్చించుకుంటూపోయి జీవిత చిగరి భాగంలో కఠినముగా తన జీవిత ముగింపు జరిగింది. హవ్వ హృదయములో సాతానుడు గొప్ప ఆశలు పెట్టాడు. ఆమె దాన్ని అంగీకరించింది. ఈ అత్యాశే దేవుడు వాళ్లకు ఇవ్వాలి అనుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదమును కోల్పోవడానికి గల కారణమైంది. హవ్వ కోరుకున్నది జరగలేదు. చక్కగా పరిచర్య చేస్తూ వచ్చినటువంటి గెహజి హృదయంలో ధనాశ వచ్చింది. ఆయన మంచి స్థితిని కోల్పోయి కుష్టి రోగిగా మారిపోయాడు.
కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా గొప్ప గొప్ప ఆశలు, గొప్ప కలలు దూరి మన హృదయము బారము కలిగిన వారిగా చేసేస్తుంది. పెద్ద పెద్ద ఆశలు మన హృదయంలో వచ్చినప్పుడు చిన్న చిన్న ఆశలను కూడా పొందుకోవడానికి అభ్యంతరం అయిపోతాయి. హెచ్చింపులు గురించిన అలోచన తప్పు కాదు కానీ వాటి యొక్క దురాశలు అనే వేషాన్ని ధరించుకొనే స్థితి మన జీవితంలోనికి రాకుండా జాగ్రత్త పడదాం. బైబిల్ చెబుతున్నట్లు సంతృప్తి గల మనసుతో ఉన్నచోట్లో తృప్తిగా జీవిద్దాం
ధనం అవసరమే కానీ ధనమే జీవితానికి సంరక్షణ అని తలంచేటప్పుడు అనేక పాపములకు అది దారితీస్తుంది. పైన చెప్పబడిన వాక్యంలో సంతృప్తి గల మనసుతో ఉండుడి అని మాత్రం చెప్పకుండా నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము కూడా ఇవ్వబడింది. అవును ధనము కాదు దేవుడే మన జీవితానికి నిరీక్షణగా ఉండనివ్వండి.
- శ్రీమతి. రూబీ అరుణ్ గారు
ప్రార్థన అంశం:
రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ లో జాయిన్ అయిన విద్యార్థుల కొరకు ప్రార్థించండి
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250