Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.06.2023
Share:

By Village Missionary Movement

Thursday, 29-Jun-2023

దిన ధ్యానము(Telugu) 30.06.2023

 

అంశం: మనుషులతోనా? మహోన్నతునితోనా? 

 

"మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు" - మత్తయి 6:5

 

ఒకసారి ఒక క్రైస్తవ కుటుంబముతో భక్త సింగ్ అనే ఒక దేవుని దాసుడు ఉండవలసి వచ్చింది. అప్పుడు ఆ ఇంట్లో ఉదయము సాయంకాలము క్రమముగా కుటుంబ ప్రార్థన జరిగేది. దాంట్లో ఆ ఇంటిలో గల పని వారు కూడా పాల్గొనేవారు కాబట్టి ఆ కూడికను చూసి సంతోషించారు భక్త సింగ్. కానీ ఒక దినము ఒక పనివాడు ఇలా చెప్పాడు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా జరగదు అని చెప్పారంట. మనుషులు మెచ్చుకోవాలని ఎలాంటి ఆత్మీయ కార్యాలు చేపట్టిన దేవుడు దాన్ని అంగీకరించరు ఎందుకంటే ఉద్దేశమ సరైనది కాదు. 

 

మనిషి యొక్క క్రూరమైన గర్వముగల పొగడ్తలను కోరుకునే హృదయాన్ని దేవుడు అంగీకరించరు. అందుకొరకే ఈ మాటలను ప్రత్యేకంగా బైబిల్ లో రాసిపెట్టి మనలను హెచ్చరిస్తున్నారు. మన దానధర్మాలు మనుష్యులు చూచి తనను పొగడాలని కోరుకుంటున్నా ఈ లోకంలో క్రైస్తవులమైన మనము ప్రార్థించుట కూడా ఇతరులు చూడకూడదు అని బైబిల్ చెబుతోంది. ఇది ఇతరులు చూడాలి అని మనం అనుకుంటే ఎంత హీనమైన పరిస్థితితో చూడండి. ఇలాంటి తలంపుతో మనం ఉండిన యెడల మన ప్రార్థన సమయంలో మహోన్నతుడైన దేవుడు ఉంటాడా? దేవుడు ఉండని యెడల ఆ ప్రార్థనలో వ్యర్ధమైన మాటలు ఎక్కువ వివరణ అలంకరింపబడిన అలంకారమైన మాటలు ఉండవు. గుండెల్లో నుండి మాత్రమే దేవుని చూసి విలపిస్తున్న మాటలు వస్తాయి. 

 

దేవుడు మనకు ప్రార్థించుటకు నేర్పించే విధానం ఏమిటి? నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి అంతరంగము ఎరిగియున్న మీ తండ్రి వైపు చూసి ప్రార్థించినప్పుడు బహిరంగంగా నీకు ఫలమిచ్చుటకు దేవుడు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత ప్రార్థనలో కూడా గర్వము దూరిపోకుండా జాగ్రత్త పడండి. ఈ దినము నేను ఎన్ని గంటలకు ప్రార్ధన చేశాను అని మాటల్లో ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలని గర్వముగా మాట్లాడకుండా జాగ్రత్త. ఒకవేళ మనం మాట్లాడుతున్నది ఒక వ్యక్తి యొక్క భక్తిని కలుగజేస్తే వారికి ప్రార్థన జీవితాన్ని ప్రోత్సహిస్తే దాన్ని మిక్కిలి తగ్గింపుతో చెప్పుట తప్పుకాదు కానీ నేను అంతరంగంలో చేసిన ప్రార్థన ఎవరికి తెలియకుండా పోకూడదు అని తలంపుతో చెప్పిన యెడల అది కూడా సాతాను యొక్క తత్వమే

 

ప్రియమైన వారలారా మనుషులు ముందు మనల్ని మనమే హెచ్చించుకొనుటకు మనం కోరుకొనవద్దు లేఖనము చెబుతోంది ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు (2 కోరింది 10: 18).

- శ్రీమతి. అనిత అలగర్ స్వామి గారు 

 

ప్రార్థన అంశం: 

మన క్యాంపస్ లో సిమెంట్ రోడ్ వేయవలసి ఉంది దానికి గల ధన సహాయము అందేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet