Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.06.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 27-Jun-2023

దిన ధ్యానము(Telugu) 27.06.2023

 

అంశం: చీకటిని వెలుగుగా చేసే ప్రభువు

 

"నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును" - కీర్తనలు 18:28

 

ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన జాన్ బనియన్ పేదరికము కారణంగా చదవడానికి వీలులేక పాత్రలు అమ్మే పని చేస్తూ వచ్చారు. ఈయన యవ్వన ప్రాయంలో చెడు అలవాట్లకు బానిసై పెరిగారు. అబద్ధమాడుతూ ఇతరులను మోసగిస్తూ పెద్దలను ఘనపరచకుండా జీవించారు. తన 19వ సంవత్సరంలో ఒక క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె తరుచుగా క్రీస్తు గురించి జాన్ తో మాట్లాడుతూ ఉండేది. తర్వాత జాన్ బైబిల్ చదవడం ప్రారంభించారు. అప్పుడు జీవితంలో ఉన్న చీకటి తొలగిపోవడం ప్రారంభించింది. ఒక దినము అనారోగ్యంగా ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ యొక్క పుస్తకాన్ని చదివి తనను క్రీస్తుకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. 

 

ఆ దినాలలో ఇంగ్లాండ్ దేశంలో బోధకులు తప్ప మరి ఎవరు కూడా సువార్తను ప్రకటించకూడదు అని ఒక చట్టం ఉండేది. దీనిని గ్రహించిన జాన్ బనియన్ మనుషులకు లోబడుట కంటే దేవునికి లోబడుట ఉత్తమమైనది అని గ్రహించారు. సువార్తను తాను ఎక్కడికి వెళ్లినా చెప్పడం ప్రారంభించారు. అందువల్ల చెరసాలలో వేయబడ్డారు. ఆయన చెరసాలలో కూడా సువార్తను ప్రసంగించారు. చెరసాలలో ఉండేటప్పుడు మోక్ష ప్రయాణము అనే శ్రేష్టమైన పుస్తకాన్ని రాశారు. 43వ సంవత్సరంలో చెరసాల నుండి విడుదల చేయబడ్డారు. తన 59వ సంవత్సరం వరకు పరిచర్య చేశారు. ఎప్పుడు క్రీస్తును హృదయంలో అంగీకరించారో అప్పుడే ఆయన పాపపు చీకటి తొలగించబడింది. లోకానికి వెలిగివ్వడం ప్రారంభించారు. 

 

అవును ప్రియమైన వారలారా! క్రీస్తు అనే వెలుగును మనం వెంబడించినప్పుడు మనలో గల చీకటి తొలగిపోయి మనము దేవున్ని దృఢంగా పట్టుకుంటాం. ఒక వెలుగు ఉన్న భాగం వైపు మనం నడుస్తూ వెళ్లిన యెడల మన నీడ మన వెనక్కి వెళ్తుంది. ఆ వెలుగును విడిచి పక్కకు వెళ్ళిన నాడు నీడ మనకు ముందుకు వస్తుంది. అలాగే మనం క్రీస్తు అనే వెలుగు వైపు నీడలా మనలో ఉండే పాప చీకటి తొలగిపోతుంది. బైబిల్లో కూడా యోహాను 8: 12 లో యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. మనం వెలుగునివ్వడం ప్రారంభిస్తే దేవుడు మహిమ పరచబడతారు అని మత్తయి సువార్త 5:16 లో చదువుతున్నాం. మన యొక్క వెలుగు ఇతరులను ప్రోత్సహించే విధముగా ఉండాలి. ఆమెన్! 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ఉంటున్న రిటైర్డ్ మిషనరీలు కొరకు వారి యొక్క ఆరోగ్యముల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet