By Village Missionary Movement
Monday, 26-Jun-2023దిన ధ్యానము(Telugu) 26.06.2023
అంశం: చింత వద్దు
"రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును" - మత్తయి 6:34
సాధారణంగా మన అనుదిన జీవితంలో చిన్న చిన్న కార్యముల కొరకు కూడా మనము చింతిస్తూ నిరుత్సాహపడుతూ ఉంటాం. అనుదిన పనుల మధ్యలో మనసులో చింతిస్తూ అనేక ఆలోచనలో ఉండిపోతు ఉంటాం. దానివల్ల ఎప్పుడు దుఃఖముతో ఉంటూ ఉంటాం. ఇలాంటి చింతించుటకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు లేకపోయినప్పటికీ రేపటి దినం గురించి చింతిస్తూ ఉంటాం. నా పిల్లలకు పని దొరుకుతుందా, నేను కోరుకున్నట్లు మంచి అబ్బాయి వస్తాడా? నాకు వయసు అయిపోతే ఎవరు చూసుకుంటారు. ఒకవేళ నేను మంచం లో ఉంటే ఎవరు చూసుకుంటారు. ఇలాగు జరగని కార్యములు గురించి చాలా విధాలుగా చింతిస్తూ ఉంటాం. ఏదో ఒక దాని గురించి చింతించకుండా ఉండలేకపోతున్నాం. నిజాన్ని చెప్పాలి అంటే చింతను మనిషిని వేరు చేయలేనంత ఏకముగా ఉన్నారు.
కానీ విశ్వాస వీరుడైన జార్జ్ ముల్లర్ మనుష్యుడు రెండు కార్యములు కొరకు మాత్రమే చింతించాలి అను చెబుతున్నాడు. ఒకటి నేను ఇంకను రక్షింపబడలేదే అని రెండవది నేను ఇంకను సాతాను యొక్క బంధకంలో పాపములో జీవిస్తూ ఉన్నానే అని చింతించాలి. ఈ రెండు కార్యాల తప్ప మనుష్యడు దేని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు అని అంటున్నారు. ఆయన తన అనుభవాన్ని చెబుతూ ఉన్నప్పుడు తన జీవితంలో గడిచిన 70 సంవత్సరములు అనేక సందర్భాలలో 2000 మంది పిల్లలకు అనాధాశ్రమాలు నడిపించుటకు కార్యములన్నింటిలో దేవుడు పైన మాత్రమే అనుకొని ఉన్నాను. దేనికొరకు చింతించలేదు. నేను ఎదురుచూస్తున్న కార్యానికి పైగా దేవుడు నాకు సహాయం చేశారు. ఒక చిన్న పిల్ల తల్లిదండ్రుల పైన ఎలాంటి విశ్వాసము కలిగి వుందో అలాంటి విశ్వాసముతో మీ యొక్క చింతలను భారములను ఆయన మీద పెట్టి ప్రభువా నా సమస్యలు మార్చుటకు మీరు శక్తివంతుడు అని విశ్వసిస్తూ ఉన్నాను అని మీ హృదయంలో చెప్పండి. విజయకరమైన చింతలేని విశ్వాసకరమైన జీవితమునకు ఇదే రహస్యము అని చెబుతున్నారు.
అవును ప్రియమైన వారలారా! మనలను పరామర్శించుటకు ఒక దేవుడు ఉన్నారు ఆయన పైన చింతలన్నీ పెట్టుటకు మనం నేర్చుకుందాం. రేపటి దినము తెరతో కట్టబడి ఉంది. దానిలో ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో అని తలంచి , ఆ తెరను తీసి చూచుటకు మనకు సామర్థ్యం లేదు రేపటి దినము ఆయనది ఆయనే సమస్తము సక్రమంగా చేయగలడు. నీ సమస్య చిన్నదో పెద్దదో అయినను దాని కొరకు దేవునితో విశ్వాసంతో చెబుదాం దేవుని యొక్క సమాధానంతో మన హృదయాన్ని సంపూర్ణముగా నింపుకుందాం.
- శ్రీమతి. జీవా విజయ్ కుమార్
ప్రార్థన అంశం:
24 గంటల చైన్ ప్రేయర్ అన్ని ఫీల్డ్ లో కూడా జరిగేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250