Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.06.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 25-Jun-2023

దిన ధ్యానము(Telugu) 25.06.2023 (Kids Special)

 

అంశం: చేతికి దొరికిన బహుమానం

 

"అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని(మూలభాషలో-ప్రవేశించుమని) అతనితో చెప్పెను" - మత్తయి 25:21

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు సెలవులలో వి. బి. ఎస్ కు వెళ్లి పాటలు కథలు మంచిగా నేర్చుకుని ఉంటారు కదా మరలా కొత్త తరగతులకు వెళ్లి చక్కగా చదివి మంచివారిగా ఎదుగుట కొరకు మీకు నా తరఫున శుభాభివందనాలు. 

 

ఒక దేశాన్ని పరిపాలిస్తున్నా ఒక రాజు ఉన్నారు. రాజు అంటే ఒక రాజ్యం అందులో ప్రజలు వారందరితో చాలా బిజీగా ఉంటారు కదా. భవనం నుండి రాజ్యసభకు వెళ్ళుటకు రాజు ఏనుగు మీద ప్రయాణం చేస్తూ ఉండగా సైనికులందరూ ఆయన చుట్టూ ఆయనను జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. ఆ దినములలో కార్లు లేవు కదా ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు చక్కగా వెళ్లడానికి ఏసీ కార్లు లేవు అటు ఇటు ఊపుతూ వెళ్తున్న ఏనుగే. హఠాత్తుగా ఏనుగు ఒకసారి కదిలింది రాజు తన పక్కనే పెట్టుకొని ఉన్న పెట్టే క్రింద పడిపోయింది. అందులో గల బంగారు నాణేలు, వెండి నాణెములు, వైడూర్యాలు అన్ని కింద పడిపోయాయి. అందరూ పరిగెత్తుకుని వెళ్లి నాకు బంగారం నాకు వెండి నాకు వైడూర్యం అని తీసుకున్నారు. రాజు అనేక ఆస్తులు గల వ్యక్తి కాబట్టి కిందపడిన బంగారము వెండి నాణెములు అన్నిటిని మీరే తీసుకోండి అని చెప్పేశారు. అది అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక సైనికుడు మాత్రం తన ఈటె ను పట్టుకుని రాజుకి ఎటువంటి ప్రమాదము రాకూడదని శ్రద్ధ కలిగి ఉండిన ఆయనను చూచి అందరూ హేళన చేసినవ్వారు. పాపం వీడికి ఒక్క దానం కూడా దొరకలేదు అని నవ్వారు. రాజు రాజ్యసభకు వచ్చిన వెంటనే తన పనిలో నిజాయితీగా ఉండి తనను సంరక్షించిన వ్యక్తికి చాలా బంగారు నాణెములు ఆస్తులు ఉన్నత పదవి ఇచ్చి ఆయనను ఘనపరిచాడు. కిందపడిన నాణెములను తీసుకున్న వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన యొక్క నిజాయితీ గల బహుమానాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఆ రాజు గారి సభలో ఉన్న వారందరూ కూడా సంతోషంతో గంతులు వేశారు. 

 

ప్రియమైన పిల్లలారా రాజు తన ఎదుట నిజాయితీగా ఉండి పనిచేసిన ఒక వ్యక్తిని ఇంతగా హెచ్చించిన యెడల మనలను సృష్టించిన రాజాధిరాజైన యేసుక్రీస్తు ఎదుట మనం నిజాయితీగా ఉండిన యెడల సంపూర్ణ మేలులతో నింపుతారు. మీకు ఇవ్వబడిన ఏ కార్యమైనా అందులో నీవు యదార్థముగా ఉంటే మేలు ఘనత వెతుక్కుంటూ వస్తుంది. ఓకే నా పిల్లలు. 

- సహోదరి. బ్యులా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet