Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.06.2023
Share:

By Village Missionary Movement

Thursday, 22-Jun-2023

దిన ధ్యానము(Telugu) 23.06.2023

 

అంశం: ఫలించే జీవితం 

 

"చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును" - మత్తయి 12:33

 

యేసుక్రీస్తు బేతనీయలో తన పరిచర్యను ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఆకలి వేసింది కాబట్టి దూరంలో పచ్చగా కనబడేటటువంటి ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఫలములను తిని ఆకలి తీర్చుకుందాం అని త్వరగా దగ్గరికి వెళ్లారు. ఆ దినాలలో అంజూరపు చెట్టు ఫలించే కాలము కానందున ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేవు. ఫలము లేని ఆ అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభువు దాన్ని శపించారు. ఇది న్యాయమా అని మన హృదయంలో ఒక ప్రశ్న రావచ్చు. అంజూరపు చెట్టు కాసే కాలము కానప్పుడు ఫలము లేకపోవడం అది అంజూరపు చెట్టు యొక్క తప్ప అని మనం ఆలోచించవచ్చును. శపించడానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఈ సంఘటన బైబిల్ లో రాయబడలేదు. దీనికి ఒక కారణం కలదు దాని ద్వారా మనము హెచ్చరింపబడాలి అనే రాసి పెట్టబడినది. 

 

వసంతకాలంలోనే అంజూరపు చెట్టు ఫలిస్తుంది. వసంత కాలము కాని మిగిలిన దినములలో అంజూరపు చెట్టు ఫలము ఇవ్వని అననుకూలమైన దినాలు. ఈ ఉపమానమును అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితంతో పోల్చి చూద్దాం. వసంతకాలం అన్నది మన జీవిత పరిస్థితుల్లో అన్ని అనుకూలంగా ఉండినప్పుడు మనము ఏం లోపం లేకుండా సంతోషంగా జీవించే కాలం. అలాంటి కాలంలో మనము దేవుని సంతోషంగా స్తుతిస్తాం. పేదలను కనికరిస్తాం, ఇతరులకు ప్రేమ, సంతోషము, శాంతి, దయ సత్కార్యములు అనే ఫలాలు ఇచ్చే కాలంగా మనం ఉంటాం. కానీ మన జీవిత పరిస్థితులు అననుకూలంగా ఉండేటప్పుడు అనగా పోరాటము, సమస్యలు, నెమ్మది లేకుండా, అవిశ్వాసము, వ్యర్థమైన నేరారూపన ఇవన్నీ మన మీదకు వచ్చినప్పుడు అవి వసంత కాలము లేని దినాలు వంటివి. ఇలాంటి కాలంలో మనం మన కార్యాలలో ఎలా కనబడుతున్నాం? తప్పిదమైన నేరా రూపణలో మన యొక్క సహనముతొ నెమ్మది అనే ఫలాన్ని ఇస్తున్నామా? అన్ని వ్యతిరేకంగా ఉండేటప్పుడు దేవుని నమ్మి సమాధానం కలిగి నెమ్మదిగా ఉంటున్నామా? మనకు మనమే ఈ ప్రశ్నను అడిగిన యెడల జవాబు లేదు అనే వస్తుంది. 

 

దేవుని ఎదురుచూపు ఏమిటి? జీవితము అనుకూలమైన పరిస్థితిలో మాత్రమే కాక అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ఫలించాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. స్నేహితులారా దేవుని నమ్మి ఆయనతో నడుస్తూ వెళుతున్న మనము శోధనల కాలంలో ఫలము లేని వారుగా మారిపోకుండా చూసుకోవాలి. మన దగ్గర ఏమీ లేకపోయినా మనం దేవుని పిల్లలము అనే పోలికలో ఎలాంటి పరిస్థితిలో కూడా మనం దాన్ని కోల్పోకూడదు. ప్రార్ధించి ప్రయాస పడదాం. దేవుడు చేయిచాచి మనకు సహాయం చేయను గాక! 

- బ్రదర్. కె. గాంధీ రాజన్ గారు 

 

ప్రార్థన అంశం:

పీస్ సెంటర్ పరిచర్య ద్వారా దర్శించబడుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet