Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.06.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Jun-2023

దిన ధ్యానము(Telugu) 22.06.2023

 

అంశం: క్షమించే మహోన్నత్వం

 

"ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి" - ఎఫెసీయులకు 4:32

 

ఒక టీచర్ తన విద్యార్థులకు క్షమించే స్వభావము నేర్పించాలి అని ఒక మంచి కార్యాన్ని చేపట్టారు. దాని ప్రకారము విద్యార్థులందరూ ఒక గోనెసంచిలో బంగాళదుంపలు తీసుకుని రావాలి అలాగే లోపల ఉన్నది బయటకు కనబడేటట్లు మరియొక ప్లాస్టిక్ సంచి తీసుకొని రమ్మన్నారు. ఎవరెవరిని మీరు క్షమించ లేకపోతున్నారో వారి యొక్క పేర్లు ఆ బంగాళదుంప పైన రాశి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క బంగాళదుంప తీసి ఆ ప్లాస్టిక్ సంచిలో వేయమన్నారు. దాని ప్రకారము గోనెసంచులో గల బంగాళదుంపలు తగ్గిపోయి ప్లాస్టిక్ సంచిలో నిండిపోవడం ప్రారంభమయ్యాయి. ఆ పరిస్థితిలో ఆ టీచర్ తన విద్యార్థులతో ఆ బంగాళదుంప పైన పేరు రాయబడిన ప్రతి ఒక్కరిని మీరు ఎప్పుడు క్షమిస్తారో అప్పుడు ఆ బంగాళదుంపను బయట విసిరేయవచ్చు లేనియెడల మీరు ఎక్కడికి వెళ్ళినా పేరు రాసిన బంగాళదుంపలు మోసుకుని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు. క్షమించడానికి మనసు లేని విద్యార్థులకు భారం తగ్గలేదు. దానితో కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ బంగాళదుంప కుళ్ళిపోయి దుర్వాసన వచ్చింది. దాంతోపాటు వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా వీళ్లను అసహ్యించుకోవడం ప్రారంభించారు. 

 

బైబిల్ గ్రంధంలో కూడా ఆదికాండ 34 వ అధ్యాయంలో యాకోబు కుమార్తె అయిన దీనాను షేకేము అనే వ్యక్తి ద్వారా పాడు చేయబడినప్పుడు యాకోబు యొక్క కుమారులు దీనా సహోదరులు అయినా సీమియోను లేవీ తన సహోదరిని వివాహము చేసి ఇచ్చినప్పటికీ వాళ్లను క్షమించుటకు మనసు లేక తన తండ్రి మాట కూడా అధిగమించి షేకేమును ఆయన పట్టణస్తులను హత్య చేసినందువలన యాకోబు తన కుటుంబాన్ని మనసులో పెట్టుకొని ఆ దేశ ప్రజల నిమిత్తము భయపడవలసిన పరిస్థితి వచ్చినది. 

 

ప్రియమైన వారలారా! మనం ప్రతి ఒక్కరిని క్షమించని ఎడల అది మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మనము నెమ్మది లేకుండా ఉండే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అది మనకు చాలా పెద్ద భారము గాను దాని వలన అందరూ మనలను అసహ్యించుకునే వ్యక్తిగాను మారిపోతాం. ఎలాగో తన భర్తను ఇద్దరి కుమారులను జీప్ లో పెట్టి తగలబెట్టినప్పటికీ ఆ వ్యక్తులను గ్రామ్స్ స్టైన్స్ యొక్క భార్య క్షమించారో మనము కూడా ఈ లోకంలో మనతో కలిసి జీవిస్తున్న మన సహోదర సహోదరిలను క్రీస్తు నందు దేవుడు మనల్ని క్షమించినట్లు మనం క్షమించడంతో మనం వారిని ప్రేమించి వారిని దీవించిన యెడల కచ్చితంగా ఆ ఆత్మలన్నీ కూడా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించును. వారందరూ నీలో గల యేసుక్రీస్తును చూసి దేవునిని మహిమ పరుస్తారు. దేశము దేవుని కొరకు సొంతమవుతుంది. ఆమెన్. హల్లెలూయ! 

- సిస్టర్. గెస్సియా గ్లోరీ 

 

ప్రార్థన అంశం:

పార్ట్నర్షిప్ మిషనరీల ద్వారా దర్శింపబడుతున్న గ్రామాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet