Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.06.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 20-Jun-2023

దిన ధ్యానము(Telugu) 21.06.2023

 

అంశం: నాయకత్వం

 

"ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను" – 1 సమూయేలు 10:27 

 

1877వ సంవత్సరంలో ఒక దినము సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారు ముందుకు రమ్మని పిలవబడ్డారు. రాడ్ని స్మిత్ అనే యవ్వనస్తుడు ముందుకు వచ్చినప్పుడు ఈయన ఒక పరదేశి అని ఎవరు అశ్రద్ధ చేసి సనుగుకున్నారు అది ఆయన చెవిలో పడింది. రాడ్ని యొక్క తల్లిదండ్రులు కూడా చదువులేని వారే. ఈ యవ్వనస్తుడి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ తన గురించి దేవునికి గొప్ప ఉద్దేశం కలదు అని రాడ్ని కచ్చితంగా గ్రహించి ఉన్నారు. ఒక బైబిల్ను మరియు ఇంగ్లీష్ డిక్షనరీని కొనుక్కొని చదవడం రాయడం నేర్చుకున్నారు. యేసుతో వెళ్ళుటకు కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటివేవీ అవసరం లేదు కల్వరి అనబడుతున్న కొండమీద ఉన్న కార్యం నేర్చుకుంటే చాలు అని ఈయన ఒకసారి చెప్పారు. అనేక అభ్యంతరాలు దాటి ఒక సువార్తికుడు అయ్యారు రాడ్ని. అమెరికాలోనూ బ్రిటన్ లోను అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించి శ్రేష్టమైన సేవకుడిగా ప్రఖ్యాతి గాంచిన వారిగా పెరిగారు సువార్తికుడు రాడ్ని. 

 

ఈ దిన లేఖన భాగంలో కూడా సౌలు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడిన తర్వాత అనేకులు ఆయనను అంగీకరించలేదు అని చదువుతున్నాం. ప్రత్యేకంగా ఈయన మనలను రక్షింప బోతున్నాడా అని సౌలు చెవులో పడేటట్ల అశ్రద్ధ చేసి మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో సౌలు చెవులు వినబడని వానివలె ఉన్నాడు అని చదువుతున్నాం. క్రైస్తవ్యం యొక్క శ్రేష్టమైన నాయకత్వం యొక్క పునాది విషయంలో ముఖ్యమైనది అనేక సమయాలలో చెవులు వినబడని వాడివలె మౌనంగా ఉండుట శ్రేష్టమైన కార్యముగా ఎంచబడుతుంది. 

 

మత్తయి సువార్త 26:63 లో యేసు నెమ్మదిగా ఉండును అని చదువుతున్నాం. తనకు విరోధముగా చెప్పబడిన ఎలాంటి నేరాలు గురించి ఎంత మాత్రమూ యేసుక్రీస్తు మాట్లాడకుండా నెమ్మదిగా కనబడ్డారు. నాయకత్వము అన్నది శ్రేష్టమైన పరిపక్వత గల తేట అయిన మాటలు మాత్రం కాదు అవసరము లేని అర్థము లేని మాటల్ని గమనించకుండా తన ముందు ఉంచబడిన పనిని శ్రద్ధతో చేస్తే అదే చాలు. 

 

క్రీస్తునందు ప్రియమైన వారలారా! నాయకత్వపు లక్షణాలు మీరు పెరగాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనము పైన చదివిన ఈ రెండు సంఘటనల ద్వారా మన జీవితంలో కూడా నెమ్మదిని పాటిద్దాం. అది కచ్చితంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది ప్రభువు మిమ్మల్ని దీవించును గాక! 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఫీల్డ్ లో మనతోపాటు కలిసి పనిచేస్తున్న పార్ట్ టైం సేవకులను, వాలంటీర్ సేవకులను దేవుడు దీవించునట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet