Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.06.2023
Share:

By Village Missionary Movement

Monday, 19-Jun-2023

దిన ధ్యానము(Telugu) 20.06.2023

 

అంశం: జట్టుగా కలిసి ఉండుడి

 

“మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” - ఫిలిప్పీయులకు 2:4

 

ఒక పెద్ద కంపెనీలో బాధ్యత అయినా పని కొరకు ఇంటర్వ్యూ జరుగుతా ఉంది. ఆ ఇంటర్వ్యూ కొరకు 150 మంది వ్యక్తులు వచ్చి ఉన్నారు. వారిని మూడు భాగాలుగా చేసి 50 మంది చొప్పున మూడు గదులలో కూర్చోబెట్టారు. తరువాత ప్రతి ఒక్కరికి ఒక బెలూన్ ఇచ్చారు. వాళ్లందరూ కూడా ఏంటి చిన్నపిల్లల వలె మాకు బెలూన్ ఇస్తున్నారు అని ఆలోచించారు. తర్వాత వాళ్ళందరికీ ఐదు నిమిషాలు ఈ బెలూన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పారు. మొదటి రెండు గదుల్లో ఉన్నవాళ్లు ఈ బెలూన్ జాగ్రత్తగా కాపాడితే పనిని ఇస్తారేమో అని అనుకొని మిగిలిన వారి బెలూన్లు పగలగొట్టడం ప్రారంభించారు. మూడవ గదిలో ఉన్నటువంటి వారు ఆ బెలూన్ ఏమీ చేయకుండా అందరూ వాటిని భద్రంగా దాచుకున్నారు. ఐదు నిమిషములు తర్వాత ఆ 150 మంది పిలవబడ్డారు. అందులో వాళ్లకి ఇవ్వబడిన బెలూన్ జాగ్రత్తగా దాచుకున్న 50 మందికి పని ఇవ్వబడింది. మిగిలిన వాళ్ళతో ఆ మేనేజర్ ఇతరులకు ఈ పని దొరకకూడదు అని మీరు ఆలోచించి వారి బెలూన్లు మీరు పగలగొట్టారు. చివరికి మీకు కూడా పని లేకుండా పోయింది. మా కంపెనీలో టీమ్ వర్క్ చేసే వారికి మాత్రమే పని ఉన్నది అని చెప్పి వాళ్ళని పంపించారు. 

 

ఈ దినములలో జట్టుగా కలిసి ఉన్నవారిని చూడడం చాలా అరుదు అయిపోయింది. ఇతరులు యొక్క స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. బైబిల్లో దానియేలు, షడ్రకు మేషకు అబేద్నగో అనేవారు బబులోను దేశమునకు చెరపట్టబడి తీసుకుని వెళ్ళబడినప్పుడు ఈ నలుగురు ఐక్యత కలిగి ఉన్నారు. రాజ భోజనము చేత తమను అపవిత్ర పరచుకొనకూడదు అని నిర్ణయించుకొని పదిరెట్లు సామర్థ్యం గల వారిగా కనబడ్డారు. రాజు చెప్పిన కల కొరకు అర్థము చెప్పాలి అని నలుగురు కలిసి ప్రార్థన చేశారు. దానియేలుకు కల యొక్క భావము ప్రత్యక్ష పరచబడింది కాబట్టి దేశంలో హెచ్చింపబడ్డాడు. అప్పుడు తన ముగ్గురు స్నేహితులను కూడా రాజు వద్దకు తీసుకుని వెళ్లి ప్రాంతీయ కార్యములను పరామర్శించుటకు వాళ్లను కూడా హెచ్చించాడు. ప్రసంగి కూడా ఒంటరిగా ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు అని చెబుతూ ఉన్నాడు. కీర్తనకారుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని రాస్తూ ఉన్నాడు. 

 

ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో ఎదుగుటకు ప్రార్థన చేయుట, బైబిలు చదువుట ఎంత ప్రాముఖ్యమో అలాగే పరిశుద్ధులతో ఐక్యత కలిగి ఉండుట కూడా అంతే ప్రాముఖ్యం. ఎలాగూ దానియేలు తన స్నేహితులతో కలిగి ఉంటున్న ఐక్యత లోకానుసారమైన దీవెనలను మరియు ఆత్మీయనుసారమైన దీవెనలను తీసుకొని వచ్చిందో అలాగే మనము కూడా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు పరిశుద్ధులతో గల ఐక్యత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు మనము ఇతరులను మనకంటే ఘనమైన వారిగా ఎంచాలి. అవును చెప్పినట్లుగా ప్రేమతొ తప్ప వేరే కార్యములో కూడా లోపం లేకుండా ఒకరి భారాన్ని ఒకరు మోస్తూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలి. అవును కలిసి పని చేద్దాం గొప్ప జయములను పొందుకుందాం.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న వైద్య సేవల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet