By Village Missionary Movement
Saturday, 17-Jun-2023దిన ధ్యానము(Telugu) 18.06.2023 (Kids Special)
అంశం: తమ్ముడు కొరకు ప్రాణం పెట్టిన అన్నయ్య
ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం
"మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి(దుష్టయుగమునుండి) విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను" - గలతియులకు 1:4
దురై అని ఒక తండ్రికి రాము సోము అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. చిన్నప్రాయంలో తల్లిదండ్రులకు లోబడి మంచిగా ఎదిగిన పిల్లలు యవనప్రాయం వచ్చేసరికి తమ ఇష్టానుసారముగా జీవించడం ప్రారంభించారు. పెద్దవాడైన రాము ఎప్పుడూ తన తండ్రికి లోబడి వచ్చేవాడు. చిన్నవాడైనా సోము అయితే చెడు స్నేహితులతో కలిసి వాళ్లతో పరిచయం పెట్టుకుని ఊరు మీద తిరుగుతూ వచ్చేవాడు. ఇది తండ్రికి చాలా వేదన కలిగించింది. యధావిధిగా కాలేజీకి వెళ్తున్న సోము తనతో చదువుతున్న ఒక విద్యార్థితో గొడవపడి తన తలను గాయపరిచాడు. సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు నాన్న సోముతో కోపముగా మాట్లాడారు. బాగా తిట్టేసి నీవు నాకు కుమారుడు కాదు నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నారు. ఈయన కూడా సంతోషముతో నేను వెళ్ళిపోతాను అని బయలుదేరి తన చెడు స్నేహితులతో కలిసి దొంగల గుంపుగా మారిపోయాడు. దినములు గడిచాయి తండ్రికి సోము గుర్తుకు వస్తూ ఉండేవాడు. ఆయన గురించి మిక్కిలి దుఃఖించేవాడు. తండ్రి యొక్క బాధను చూచిన పెద్ద వాడు రాము తండ్రి యొద్దకు వెళ్లి నాన్న తమ్ముడు మనసు మార్చుకుని మరల ఇంటికి వస్తే ఆయనను అంగీకరిస్తారా అని అడిగాడు. తండ్రి ఖచ్చితంగా అంగీకరిస్తాను అందుకొరకే కదా వేచి ఉన్నాను అని అన్నారు. తర్వాత ఆయన తన పనివాళ్ళు వద్దకు వెళ్లి నాకంటే మీరు సోమునే గదా ఎక్కువగా ప్రేమించారు నేను ఆయనను క్షమించి అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నాను నా తరఫున వారి వద్దకు వెళ్తారా అని అడిగారు. వెంటనే పనివాళ్ళు సోము కలిసి ఉంటున్నది దొంగలు గుంపుతో వాళ్లని చూచుటకు రాత్రుల్లోనే వెళ్లాలి. ఒకవేళ అలా వెళ్ళినా గాని ప్రాణముతో తిరిగి రావడం కష్టము అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. వెంటనే రాము నేను వెళ్తాను నాన్న అని చెప్పి రాత్రి బయలుదేరాడు. అప్పుడు చిన్నవాడైన సోము అన్నయ్యను కొట్టి తన చేతిలో గల సంచులు లాగేసుకున్నాడు. అప్పుడు రాము తన తమ్ముడితో నాన్న నిన్ను అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నారు. నీవు మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి మరణించాడు. వెంటనే సోము తన అన్నయ్యను అన్యాయంగా చంపేశాను అని దుఃఖపడి విరిగిన హృదయంతో తన తప్పును ఒప్పుకుని మనసు మార్చుకొని ఇంటికి వెళ్ళాడు. తండ్రి సంతోషముతో తన కుమారుడిని అంగీకరించారు.
ప్రియ తమ్ముడు చెల్లి ఇలానే యేసయ్య కూడా మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణములను పెట్టి మనలను రక్షించుకున్నారు.
- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250