Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.06.2023
Share:

By Village Missionary Movement

Saturday, 17-Jun-2023

దిన ధ్యానము(Telugu) 17.06.2023

 

అంశం: ముత్యాలుగా మారండి

 

"దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది" - ప్రకటన గ్రంథం 21:21

 

సముద్రపు లోతుల్లో ముత్యము ఎలాగూ తయారవుతుంది అనే సత్యం మీకు తెలుసా? గుల్లలో మట్టి ఇసుక లోపలకు వెళ్ళిపోతుంది. తీసుక ఆ గుల్లలో గల మృదువైన జీవరాశి యొక్క శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. అ గుల్లలో గల ఆ ప్రాణి నాకెందుకు ఇలా జరగాలి అని ప్రశ్న వేయకుండా మిక్కిలి శ్రద్ధతో ఇబ్బంది పెడుతున్న ఆ ఇసుక చుట్టూ బంతి వంటి ముద్దును తయారుచేస్తుంది. కాబట్టి ఆ కఠినమైన ఇసుక మృదువైన బంతిగా మారిపోతుంది. ఆ గుల్ల లోపలికి వచ్చి తనను గాయపరిచిన ఆ ఇసుకను ఆ జీవరాశి ముత్యముగా మార్చుట నేర్చుకుని ఉన్నది. 

 

నూతన యెరుషలేము నగరం యొక్క ప్రతి ద్వారం లోనూ ఒక్కొక్క ముత్యము ఉంచబడింది అని చెప్పినప్పుడు అవి మామూలు ముత్యములు అనే విధముగా చెప్పబడలేదు. లోకంలో ఇతరుల గాయములు కట్టుటకు ప్రయాసపడిన వారు, తమను గాయపరిచిన వాళ్ళని క్షమించినవారు ఈ ద్వారం గుండా నడుస్తూ దేవుని నగరంలోనికి వెళ్తారు. 

 

ప్రియమైన వారలారా! మీ యొక్క దుఃఖములను ముత్యాలుగా మార్చుటకు దేవుని యొక్క సహాయమును అడగండి. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు లోకంలోనే ఉన్నారు. ఆయన దుఃఖముతో నిండిన వారిగాను శ్రమ అనుభవించిన వారిగాను ఉన్నారు. యెషయా 53: 3 గాయపరచుట, దుఃఖము, నిరుత్సాహము, నిస్సహాయము అనే మన పోరాటంలో ఎలాగ ఉన్నప్పటికీ అదే స్థానంలో ఉండి మీరు యేసుక్రీస్తు యొక్క స్వరమును వినగలరు కాబట్టి ధైర్యం తెచ్చుకొనుడి. 

 

యేసుక్రీస్తు ప్రభువు నిత్యమైన కార్యములు పైనే దృష్టి పెట్టి జీవించారు. మనము కూడా దేవుని మీద నిరీక్షణ పెట్టి నిత్యము మన సమస్యలకు కారణము అడగకుండా నేర్చుకొని జీవించే జీవితము కొరకు ప్రయాస పడదాం. తమను మన కొరకు త్యాగం చేసి ఇంతగా ప్రేమించిన దేవుని వద్ద మనలను సమర్పించుకుందాం. అప్పుడు నిత్యపు వెలుగులో జీవించుట కొరకు మన దుఃఖములన్నీ ముత్యముగా మార్చుటకు ఆయన నేర్పిస్తారు. ఆ మార్గము గుండా అనేకులు ప్రవేశించినట్లు మనము కూడా ప్రవేశించి సంతోషాన్ని, ఉత్సాహాన్ని పొందుకుందాం. ఆమెన్! 

- సహోదరి. బ్యూలా గారు

 

ప్రార్థనా అంశం:-

ఆమెన్ విలేజ్ టీవీ ఛానల్ కొరకు దాని యొక్క ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al