By Village Missionary Movement
Wednesday, 14-Jun-2023దిన ధ్యానము(Telugu) 14.06.2023
అంశం: అద్భుతమైన ఒక అద్భుతమైన సాక్ష్యం
"తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు" - యోవేలు 2:28
చెన్నైలో ఒక ప్రాంతంలో ఒక పేద విధవరాలు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ తన ఎనిమిది సంవత్సరాలు గల మనవరాలుతో నివసిస్తూ ఉన్నది. ఆ తల్లి ఎక్కువగా బైబిల్ ధ్యానించి భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేస్తూ భారముతో ప్రార్థించేది. ప్రతిరోజు దేవుని వెతికేవారు. క్రమముగా ఆదివారం ఆరాధనలో పాల్గొనేవారు. దేవాలయంలో వాక్యాన్ని శ్రద్ధగా విని తన హృదయంలో దానిని భద్రపరుచుకుని తన మనవరాలుకు బోధించేవారు. ఆమెను పరిచర్యకు సమర్పించి తనకు వచ్చే చిన్న రాబడితో ఆ మనవరాలను చదివిస్తూ భక్తిశ్రద్ధలతో పెంచుతూ వస్తున్నారు. ఆమె తన అమ్మమ్మ ఇష్టానుసారముగా దేవుని దృష్టిలో ప్రియమైన కుమార్తెగా ఎదుగుతూ వస్తుంది.
ఆ తల్లి ఒంటరిగా ఇంట్లో ఉన్నందున తన ఇంటి మధ్యలో కుర్చీ వేసి దాంట్లో యేసుక్రీస్తు కూర్చుని ఉన్నట్లు బైబిల్ లో గల నేను నిన్ను విడువను ఎడబాయను యెహోషువ 1:5లో గల వాక్యం అనుసారముగా తనను బలపరుచుకుని ఆ మనవరాలకు కూడా బోధిస్తూ వచ్చేది. దేవుడైన యెహోవా తన పరిపూర్ణమైన ప్రసన్నత చేత వాళ్ళను నింపుతూ పరామర్శిస్తూ వస్తున్నారు. గడిచిన వారంలో ఒక సాయంకాలంలో వారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్న సమయంలో మనమరాలు యొక్క కళ్ళు తెరిచేసరికి ఏమిటి ఆశ్చర్యం అంటే యేసు క్రీస్తు ప్రభువు ఆమె పెట్టి ఉన్నటువంటి కుర్చీలో కూర్చుని ఉండుట ఆమె కనబడింది. యేసయ్య చేతులు కాలు తేటగా కనబడ్డాయి ఆయన శరీరము ఒక ఆత్మ వలె కనబడింది. ఆ మనవరాలు దాన్ని చూసినప్పుడు సంతోషముతో కూడిన భయముతో తన అమ్మమ్మ ను కౌగిలించుకున్నది.
చివరి దినాలలో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు దర్శనములు చూచెదరు అని యోవేలు 2: 28 ప్రకారము ఇలా జరిగింది. దేవుడు తమ పిల్లలకు ఆదరణగాను, కొండగాను ఉండుట మనం చూడగలుగుతున్నాం. అవును మా దేవుడు మనతో ఉన్నారు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నారు. మనము దేని గురించి చింతించకుండా కలవర పడకుండా ఉండాలి.
- బ్రదర్. భాగ్యనాధన్ గారు
ప్రార్థన అంశం:
మోక్ష ప్రయాణం, కన్వీనియకేల్, యెహోషువ లెమ్ము అనే మాస పత్రిక పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250