Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.06.2023
Share:

By Village Missionary Movement

Monday, 12-Jun-2023

దిన ధ్యానము(Telugu) 13.06.2023

 

అంశం: వేచి ఉండుట

 

"కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము" - సామెతలు 13:12 

 

వేచి ఉండుట మనకు నచ్చని ఒక కార్యము. కొన్ని ఆశీర్వాదాలు కొరకు మనం అనేక దినముల నుండి ప్రార్థిస్తూ ఉండినప్పటికీ అది మనకు దొరకని ఎడల దుఃఖము కలుగుతుంది. తర్వాత ఆ కార్యం కొరకు ప్రార్థన చేయడం కూడా మానేస్తాము. పనికొరకు, వివాహం కొరకు, ఇల్లు కట్టుట కొరకు, పిల్లల కొరకు అని అనేక కార్యాలకు వేచి ఉన్నప్పుడు నిరుత్సాహము ఏర్పడుతుంది. కానీ యేసుని అంగీకరించిన మనము దేని విషయంలో కూడా నిరుత్సాహము పడవలసిన అవసరం లేదు. బైబిల్లో అనేక దినాలు వేచి ఉన్నవారు మరి అధికమైన దీవెనలను పొందుకున్నారు అని చూడగలము. 

 

హన్నా పిల్లలు లేకుండా గొడ్రాలు అయి ఉంది. భర్త ఆమె మీద ప్రేమ చూపినప్పటికీ తన మరియొక భార్య అయిన పెనిన్నా హన్నాను అనేక మాటలు చేత హింసించే క్రియలు చేత హన్నాను గాయపరుస్తూ ఉండేది. హన్నా తన మనో దుఃఖాన్ని ప్రభువు చెంత పెట్టి మొక్కుబడితొ ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను కనికరించి ఆమెకు సమూయేలును ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేలు దేశమునకు ప్రవక్తగా, రాజులను అభిషేకించే వాడిగాను ప్రజలకు న్యాయాధిపతిగాను ఉన్నాడు. 

 

రిబ్కా 20 సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉన్నది. విస్తారమైన సమయము వేచి ఉన్న తర్వాత దేవుడు ఆమెకు ఎసావు, యాకోబు అనే కలవల పిల్లలని ఇచ్చారు. ఇద్దరు గొప్ప జనాంగముగా ఆశీర్వదించబడ్డారు. అందులోనుండి యాకోబును, యాకోబు నుండి యూదాను,యూదా నుండి యేసుక్రీస్తు ప్రభువును జన్మించారు. 

 

అలాగే అనేక సంవత్సరాలు గొడ్రాలుగా వున్న మనోహ భార్య బలవంతుడైన సంసోనును కన్నది. ఆయన ఇశ్రాయేలీయులను ఫిలిస్థియుల చేతిలో నుండి విడిపించేవాడిగా ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడాను ఎలిజబెత్ జకర్యా దంపతులు వృద్ధాప్యం వరకు వేచి ఉండి నిరీక్షణ లేని పరిస్థితులలో కూడా ఆ వృద్ధాప్యంలో గర్భము దాల్చి బాప్తిసమిచ్చు యోహానును కన్నారు. ఆయన యేసుక్రీస్తుకు ముందు మార్గమును సిద్ధపరచి ప్రజలను పరలోక రాజ్యం వైపుకు నడిపించిన ప్రవక్తగా ఉన్నాడు. 

 

మనము కూడా అనేక కార్యముల కొరకు వేచి ఉండి నిరుత్సాహపడకుండా దేవుని కొరకు సహనముతో వేచి ఉందాం. యెషయా 40: 31 వాక్య ప్రకారము దేవుడు మనకు నూతన బలమును దయ చేస్తారు. మన జీవిత పరుగులో అలసట చెందకుండా పరిగెత్తుటకు దేవుడు మనల్ని బలపరుస్తారు. ఆశించిన కార్యము జీవ వృక్షము అన్నట్టు దేవుడు గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని మన జీవితంలో దయచేస్తారు. దేవుడు మన యొక్క వేచి ఉంటున్న కార్యములను జీవవృక్షముగా మార్చును గాక! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:

ఉత్తర భారత దేశంలో పరిచర్య చేస్తున్న మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al