Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.06.2023
Share:

By Village Missionary Movement

Saturday, 10-Jun-2023

దిన ధ్యానము(Telugu) 10.06.2023

 

అంశం: ఎల్లప్పుడూ ప్రార్ధించుడే

 

"వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను" - లూకా 18:1 

 

దేవుడు నిరుత్సాహపడిన వాళ్లకు బలం ఇస్తున్నారు. నిరుత్సాహ పడిపోయిన ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఏలియాతో చెప్పినప్పుడు బయలుదేవత ముందు మోకరించన 7000 మందిని నేను సంరక్షించాను అనియు ఏలియా మీద పెట్టుకున్న ప్రణాళికను చెబుతున్నారు. ఏలియా యొక్క నిరుత్సాహాన్ని తీసివేసి బలము పొందుకొని దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు ముందుకు వస్తున్నారు. యోనాతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నిరుత్సాహము తీసివేయబడిందా లేదా మనకు తెలియదు. అవును దేవుని పిల్లలారా మనము కూడా నిరుత్సాహ పడిపోతున్న ప్రతిసారి దేవుడు తన మాటల ద్వారా దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. దానికి మనము చెవియొగ్గినప్పుడు దేవుని బలముతో నింపబడి దేవుని కొరకు పనిచేయడం ప్రారంభిస్తాము. 

 

అనేక సమయాల్లో మనము ప్రార్థనలో నిరుత్సాహపడిపోతూ ఉంటాము. లెంటు దినాలలో ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాము. ఉపవాసము చేస్తూ ఉంటాం. ఆలయానికి వెళుతూ ఉంటాం. 40 దినాలు ముగించిన తర్వాత ఇవన్నీ తగ్గిపోతాయి. దీనికి గల కారణము ఒక విధమైన సంతృప్తి. 40 దినాలు ప్రార్ధన చేసి ఏదో సాధించేసాము అని తలంచుతు ఉన్నాము. కానీ ఒక వ్యక్తి సరిగా నిలబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెబుతూ ఉన్నారు. మన పరుగు తుద ముట్టించే వరకు ప్రార్థించాలి. 

 

ప్రార్థనలో నిరుత్సాహము వస్తాది కాబట్టే సోలిపోకుండా ప్రార్థించుడి అని బైబిల్ మనకు సలహా ఇస్తుంది. మన యొక్క ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు అనేక సంవత్సరాలుగా కొన్ని మేలులు కొరకు వేచి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నిశ్శబ్దముగా ఉండేటట్లు కనబడుతున్నప్పుడు మనకు నిరుత్సాహము ఎక్కువైపోతుంది. కానీ ప్రభువు ఈ దిన లేఖనముల ద్వారా చెబుతున్న కార్యము ప్రార్థనలో ఎన్నడును నిరుత్సాహపడకండి. మీ ప్రార్ధనకు కచ్చితంగా జవాబు దొరుకుతుంది. తగిన కాలములో నేను మీకు జవాబు ఇస్తాను అని అంటున్నారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఒకవేళ ఈరోజు మీరు కూడా నిరుత్సాహపడి ప్రార్థనను ఆపివేయాలి అనే మనసుతో ఉన్నారా? లేక లేదు నా ప్రార్థన దేవుడు వినలేదు అని అవిశ్వాసముతో నిరుత్సాహ పడిపోయి ఉన్నారా? దీని ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ ప్రార్థించాలి అన్నదే ఆయన కోరిక మీరు అడుగుతున్న కార్యాలు సర్వ శక్తి కలిగిన దేవుని ముందు సాధారణమైన కార్యం. తగిన సమయం వచ్చినప్పుడు తమ చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన చిత్తం ఎల్లప్పుడూ గొప్పగాను మేలు కరముగాను ఉంటుంది. ఈ దినము ఎడతెగక ప్రార్థించుటకు నిర్ణయము తీసుకుందాం. ప్రయాస పడదాం. విజయం పొందుకుందాం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

స్వస్థత ఇచ్చే ఆరాధనలో పాల్గొంటున్న అనేకులు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆరోగ్యం పొందుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet