By Village Missionary Movement
Friday, 09-Jun-2023దిన ధ్యానము(Telugu) 09.06.2023
అంశం: విశ్రాంతి ఇక్కడ లేదు
"కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను" – 1 కోరింథీయులకు 9:26
సాధించేవారు ఎవరు జన్మించరు. కానీ సాధించేవారుగా తయారైన వారు ఈ లోకంలో అనేకులు గలరు. మేఘము వంటి ఇంత విస్తారమైన సాక్షి సమూహము మనలను ఆవరించినప్పుడు అని చదువుతున్నాం అందులో గల ఒక సాక్షిని ఈరోజు మనం చూడబోతున్నాం.
ఆయన హేన్డ్రి ఫ్రాన్సిస్. ఆయనకు వైద్య చదువు చదవాలి అని ఆలోచన ఉన్నప్పటికీ దేవుని పిలుపును గ్రహించిన వాడిగా వేదాంత విద్య చదువుటకు కాలేజీలో జాయిన్ అయ్యారు. నాతో ఉండండి నా ప్రియ ప్రభువా అనే పాట వ్రాసినది ఈయనే. జీవితకాలమంతా క్షయరోగంతో పిడింపబడి ఉన్నప్పటికీ విశ్వాసములోను ఆత్మీయతలోనూ మిక్కిలి బలము కలిగిన ఈయన కృప కొరకు తన జీవితమంతా కూడా సమర్పించుకున్నాడు. ఆయన పెదవులు తరచుగా చెప్పే ఒక మాట లోకము కొరకు తుప్పు పట్టి నశించి పోవుట కంటే దేవుని కొరకు పనిచేసి అలసట పొందుట శ్రేష్టమైనది. ఈ మాటలు మనలను కూడా ఉద్వేగ పరుస్తుంది కదూ.
అపోస్తులైన పౌలు జీవితంలో కూడా అనేక బలహీనతలు ఉండేవి. దానిని లెక్కచేయకుండా దేవుని కృపపై ఆనుకొని అనేకసార్లు ఓడ ప్రయాణం చేసి అనేక ప్రయాసలు అనేక శ్రమలు అనేకసార్లు నిద్రలేమి, ఆకలి, దప్పిగా, ఉపవాసము, చలి అని ఆయన పొందుకున్న శ్రమలు పట్టిక చాలా పొడవుగా ఉంది. క్రీస్తు కొరకు ఆయన పరిగెత్తిన పరుగు గొప్పది. తన జీవితము ఆఖరి వరకు ప్రభువు కొరకై పరిగెత్తి తన జీవితాన్ని ముగించారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ ఆయనను ఉద్వేగపరిచింది. ఆ యొక్క విశ్రాంతి ఈ భూలోకంలో లేదు అని గ్రహించేవాడిగా మహోన్నత పిలుపుకు తగిన బంధపు బహుమానం పొందుటకు ఆయన కూర్చొని ఉండలేదు
అవును ప్రియమైన వారలారా! శరీర బలహీనతలలో కూడా దేవుని కొరకు అలసిపోకుండా పరిగెత్తిన హేన్డ్రి మరియు పౌలు వలె దేవుని పిల్లలమైన మనకు నేర్పించిన కార్యము ఒకటే విశ్రాంతితో ఉండిపోకండి దేవుని కొరకు ఏదైనా చేయండి. దీనిని మంచిగా గ్రహించిన అపోస్తులైన పౌలు నిశ్చయత లేని వాడిగా పరిగెత్తను (1కోరింథీయులకు 9: 26) అని చెప్పి తన పరుగును జయముగా తుద ముట్టించారు. నా విశ్రాంతి పరలోకములో ఉన్నది ఇక్కడ లేదు మరి మీయొక్క మాట ఏమిటి?
- శ్రీమతి. మంజుల గారు
ప్రార్థన అంశం:-
తమిళనాడులో మన పరిచర్య ద్వారా అవసరమైన వెయ్యి గ్రామాలలో 1000 సంఘాలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250