By Village Missionary Movement
Thursday, 08-Jun-2023దిన ధ్యానము(Telugu) 08.06.2023
అంశం: గోడ పైన రాయబడిన చేతివేళ్లు
"ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్న ట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా" - దానియేలు 5:5
ఈ దిన లేఖన భాగంలో గోడ పైన రాసిన చేతివేళ్లు బెల్తెషాజరూ అనే రాజు చూసినప్పుడు కలత చెందాడు. ఆయన కాళ్లు వనికిపోయాయి. 1000 మందికి పైగా విందులో పాల్గొన్నారు. అందరికీ కనబడేటట్లు ఆ వ్రాత వ్రాయబడింది. యధావిధిగా జ్ఞానులు, జ్యోతిష్యులు రప్పించబడ్డారు. భావము చెప్పమని అడగబడ్డారు కానీ ఆ వ్రాత ఎవరు చదవలేకపోయారు. భావం చెప్పా లేకపోయారు.
దానియేలు పిలవబడ్డాడు. అప్పుడు ఆయన ఈ వ్రాత ఎందుకు రాయబడ్డాది దానికి గల భావం ఏమిటి అని వివరించాడు. ఈ చేతి వేలు యొక్క అక్షరాలు దేవుడు పంపించిన సందేశము అని చెప్పవచ్చు. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని నాలుగు పదాలు మాత్రం రాయబడ్డాయి. దాంట్లో మెనే మెనే అనే పదం రెండుసార్లు రాయబడ్డాయి. రాయడానికి గల కారణం ఏమిటి? మొదటిగా వీటన్నిటిని గ్రహించి రాజు తన హృదయాన్ని తగ్గించుకొనకుండా పరలోకంలో గల దేవుని విరోధముగా హెచ్చించుకున్నాడు. రెండవది దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మర్యాదను ఇవ్వకుండా దేవుని ఆలయములో ప్రతిష్టింపబడిన వస్తువులను అసహ్యంగా వాడుకున్నాడు. రాజు త్రాసులో తూయబడి లోపముగలవాడిగా ఎంచబడ్డాడు.
అవును ఈ దినము అదే ప్రభువు మిమ్మల్ని నన్ను కూడా తూచి చూస్తున్నారు. మన ఆలోచన క్రియలు ఉద్దేశము అన్నింటినీ తూచి చూస్తున్నారు. గర్వము ఎప్పుడూ దేవునికి వ్యతిరేకమైనది. గర్వంతో ఉండిన యెడల మనము ఈ దినమే మనలను పరీక్షించుకుని చూద్దాం. మనకు కూడా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
అనే ఎస్ఎంఎస్ వచ్చిందా? అయితే దేవుని వద్ద మనలను మనం తగ్గించుకుందాం. అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తారు.
- బ్రదర్. టీ. రాజన్ గారు
ప్రార్థన అంశం:-
ట్యూషన్ సెంటర్ పరిచర్య ద్వారా దర్శించబడుతున్న విద్యార్థులు భవిష్యత్తు కొరకు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250