Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.06.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 07-Jun-2023

దిన ధ్యానము(Telugu) 07.06.2023

 

అంశం: పట్టుదల

 

"మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" - 2 కోరింథీయులకు 2:14

 

ఒకసారి ఒక టీ షర్ట్ కొనుటకు అనేక షాపులు తిరిగిన నేను కొనాలి అనుకున్న టీ షర్టు నాకు దొరకలేదు. ప్రతి షాప్ వాడు మీరు అడుగుతున్న మోడల్ దొరకదు. ప్రస్తుతానికి ఇవే ఫ్యాషన్ అని చెప్పాడు. వాటిలో ఏదో ఒకటి కొనడం తప్ప వేరే దారి లేదు అని ఆలోచించాను అయినను దానిని వెతకడం కొరకు మరికొన్ని షాపులు తిరిగాను. చివరిగా ఒక షాపులో నేను కోరుకున్న టీషర్ట్ దొరికింది. ఇది ఒక సాధారణ కార్యంగా ఉండవచ్చు. 

 

విజయాన్ని ఎదురుచూస్తున్న మనకు అనేకసార్లు మనం ఎదుర్కొన్నది అపజయం కావచ్చు. మోషే ఫరో యొద్ద విజయం ఎదురు చూసి వెళ్ళినప్పటికీ ఆయనకు తొమ్మిది సార్లు అపజయమే దొరికింది. అయినప్పటికీ దేవుడు మోషేతో మరల మరలా వెళ్ళమని ప్రేరేపించారు. చివరికి పదవసారి విజయము దొరికింది. దేవుడు మోషే ద్వారా సమస్త ఇశ్రాయేలీయుల ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. అలాగే అమెరికా చరిత్రలో అబ్రహం లింకన్ చాలా ప్రాముఖ్యమైనవాడు కానీ ఆయన జీవితంలో మరల మరల అపజయాన్ని చవి చూసేవాడు. అయినను అబ్రహం లింకన్ ఇంతే అని ఎప్పుడు ఆగిపోలేదు చివరికి అమెరికా రాష్ట్రపతిగా హెచ్చింపబడ్డాడు. 

 

మనము కూడా మన జీవిత మార్గంలో ఎన్నో అపజయాలు చవిచూసి ఉండవచ్చు. అపజయముతో జీవించడమే మన పరిస్థితి అని ఇశ్రాయేలు జనాంగము నిరుత్సాహపడి జీవించవచ్చు. పై చదువులకు పరీక్షలు రాస్తూ పనులు కొరకు పరీక్షలు రాస్తూ ఎదురుచూస్తున్న సహోదరి సహోదరులారా మీరు ఎదురుచూస్తున్న మంచి మార్గం దొరకలేదా? దొరకలేదని విలాపిస్తూ ఉన్నారా? ఇక విజయం లేదు అని నిర్ణయానికి వచ్చి ఉండిపోకండి. విజయము పొందుకున్న వరకు మోషే వలె అబ్రహాము లింకన్ వలె ముందుకు వెళుతూ ఉండండి. దేవుని పైన ఆనుకుని వాగ్దానాలు పట్టుకుని ఆయనతో పోరాడండి విజయం ఖచ్చితం. 

- శ్రీమతి. రూబీ అరుణ్ 

 

ప్రార్థన అంశం:-

ట్యూషన్ సెంటర్ పరిచర్యలో మనతో కలిసి పనిచేస్తున్న మిషనరీలను దేవుడు బలముగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet