Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.06.2023
Share:

By Village Missionary Movement

Monday, 05-Jun-2023

దిన ధ్యానము(Telugu) 06.06.2023

 

అంశం: కళాకారుడైన దేవుడు

 

"నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు" - సామెతలు 3:11

 

ప్రఖ్యాతిగాంచిన శిల్పాలు గల దేశము మన భారతదేశం. మన భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఈ శిల్పాలు కనబడుతూ ఉంటాయి. పర్యాటక ప్రాంతాలు మన భారత దేశంలో ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో మహాబలిపురం దీనికి మంచి ఉదాహరణ. ఉత్తరాంధ్రలో అజంతా, ఎల్లోరా గుహలు మిక్కిలి శ్రేష్టమైనవి. ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన శిల్పం చైనా దేశంలో ఉన్నది. దాని ఎత్తు 425 అడుగులు. ఆ శిల్పం నిర్మించుటకు 66 అడుగులు గల లోటస్ వంటి సింహాసనం అమర్చబడి ఉంది. ఈ శిల్పం నిలబెట్టుటకు ఉంటున్న ఆ కట్టడం అన్ని కలిపిన యెడల మొత్తం 502 అడుగులు. ఈ శిల్పాన్ని ఇత్తడి లోహముతో తయారుచేసి ఉన్నారు. దీని విలువ 90 కోట్ల రూపాయలు. ఇలాంటివి అనేక శిల్పాలు మరియ శిల్పాకారులు కలరు. 

 

మన యేసయ్య గొప్ప శిల్పా కారుడు అని వర్ణించవచ్చు. పాపముతో నిండి ఉన్న ఒక మనిషిని ఆయన పట్టుకుని పరలోక మహిమను ప్రత్యక్షపరిచే వ్యక్తిగా చెక్కుటలో ఆయన సామర్థ్యం గల దేవుడు. సమాజంలో అసహ్యులు అని మనము ద్వేషిస్తున్న వాళ్లును కూడా అందమైన వాళ్లగా మార్చిన చరిత్ర ఆయనకు కలదు. ప్రపంచంలోనే ఎలాంటి శిల్పకారుడు కూడా దీనిని చేయలేడు. పేతురు యొద్ద కనబడిన తొందరపాటు గుణాన్ని ఆయన చెక్కి ఆయనను గొప్ప ప్రసంగీకుడిగా మార్చారు. పౌలు, మగ్దలేనే మరియా, యాకోబు వంటి వారు దేవుని చేత చెక్కబడి పరలోక గుణముతో నింపబడిన చరిత్ర మనకు తెలిసినదే. 

 

శిల్పకారుడు అయిన యేసు మిమ్మల్ని కూడా చెక్కి ప్రయోజనకరమైన శిల్పముగా మార్చుటకు సిద్ధంగా ఉన్నారు. ఆయన హస్తముకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే చాలు మాటలు రాని మోషేను వాడుకొని లక్షల మంది ప్రజలను నడిపించుటకు వాడుకున్నట్లు మిమ్మును కూడా వాడుకొనుటకు ఆయన సమర్ధుడు. భయపడి దాక్కున్న గిద్యోనుని న్యాయాధిపతిగా మార్చిన ప్రభువు మిమ్మల్ని కూడా మీలో ఉన్న భయాన్ని తీసివేసి నడిపించగల సామర్థ్యం గల దేవునిగా అభిషేకాన్ని మీకు ఇవ్వగలరు. ఆయన ఇష్టానుసారంగా ఆయన చేతుల్లో మనలను చెక్కుటకు అప్పగించండి. అవసరము లేని కార్యాలను చెడు కార్యాలను చెక్కుటకు ఆయన చిత్తానుసారముగా ఆయన చేతి పాత్రగా మనం విడిచిపెట్టిన యెడల ఆయనకు ఇష్టమైన పాత్ర వలే మనలను తయారు చేయగలరు. ఆమెన్! 

- బ్రదర్. టీ. రాజన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో జరుగుతున్న ట్యూషన్ సెంటర్ల ద్వారా అనేక మంది విద్యార్థులు దేవుని చెంతకు చేరులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al