By Village Missionary Movement
Monday, 05-Jun-2023దిన ధ్యానము(Telugu) 05.06.2023
అంశం: యవ్వనలు అందరూ
"వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు" - కీర్తనలు 127:5
ఆ సంఘంలో యవనస్తుల కొరకు ఒక చలనచిత్రం చూపించబడుతుంది అని అనేక దినములు నుండి ప్రార్థనతో వేచి ఉన్నారు. చలనచిత్రం చూపించే రాత్రి కూడా వచ్చింది. ఆ గ్రామంలో అన్నిపక్కల చలనచిత్రం కొరకు ఫ్లెక్సీలు పెట్టబడి ఉన్నాయి. న్యూయార్క్ లో చాలా క్రూరమైన నేరాల్లో పాల్పడిన ఒక యవ్వన గుంపు ఒక బోధకుడు ద్వారా ఎలాగు దేవుణ్ణి తెలుసుకున్నారు అనే కార్యాన్ని వివరించే సినిమా అది. మరియు అనేకమంది యవ్వన పిల్లలు సంఘంలో యవ్వన గుంపులో కలుసుకునుటకు ఇది ఒక మంచి సాధనంగా సహాయపడుతుంది అని ఆ సంఘము యొక్క బోధకుడు స్టీవ్ నిరీక్షణతో ఉన్నారు.
కానీ ఆరోజు సాయంకాలము చాలా ప్రాముఖ్యమైన ఫుట్ బాల్ మ్యాచ్ ఒకటి టీవీలో ప్రసారమవుతున్నదాన్ని ఆయన గ్రహించలేదు. కాబట్టి ఆయన ఎదురుచూస్తున్న దాని కంటే తక్కువ మంది యవ్వనస్తులే అక్కడికి వచ్చారు. నిర్ణయించబడిన సమయంలో ఆ రాత్రి సినిమా ప్రసారం చేయబడింది. హఠాత్తుగా అక్కడికి టి డాక్ అనే యవ్వన గుంపు ఒకటి వచ్చింది. అందులో ఐదుగురు యవ్వనస్తులు ఉన్నారు. వాళ్ళందరూ యేసుని ఎరగనివారు. ఇది క్రైస్తవులకు మాత్రమేనా లేక మేము కూడా చూడవచ్చా? ఉచితమే కదా? అని వాళ్లకు వాళ్లే ప్రశ్నలు అడిగేసి వచ్చి కూర్చొని సినిమా చివరి వరకు చూసి ఆనందించారు. వాళ్ల కొరకు బోధకుడు స్టీవ్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సినిమాను చూసి సంతోషముతో వెళ్లారు.
సంఘంలో యవ్వనస్తుల మధ్యలో చేయబడుతున్న పరిచర్య గురించి అవగాహన తక్కువగా ఉంది. సంఘము బయట ఉన్న యవ్వనస్తులకు పరిచర్య చేయడానికి కూడా మనం పిలవబడి ఉన్నాను. ఈ మందలో లేని కొన్ని గొర్రెలు బయట ఉన్నాయి. వాటిని ఇక్కడికి తీసుకుని రావాలి అని ఏసుక్రీస్తు ప్రభువు చెప్పిన దాన్ని మనం గ్రహించి ఉన్నాము కాబట్టి మన ప్రభువు యొక్క కోరికను ఎరిగినవారిగా మందలో చేర్చబడని గొర్రెలు సమకూర్చుటకు మనము తీవ్రంగా పనిచేద్దాం.
- బ్రదర్. జాకబ్ శంకర్ గారు
ప్రార్థన అంశం:
ప్రార్థన గుంపులను నడిపిస్తున్న అనేక దేబోరాలు మనకు దొరికేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250