Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.06.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 03-Jun-2023

దిన ధ్యానము(Telugu) 04.06.2023 (Kids Special)

 

అంశం: పీటర్ మామయ్య బోటు. 

 

"నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది" - కీర్తనలు 119:56

 

హలో పిల్లలారా! సెలవు రోజులన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా! సముద్ర తీరానికి వెళ్లి మట్టితో ఇల్లు కట్టుకొని ఆడుకున్నారా? ప్రకృతి యొక్క సహజమైన గాలి మరియు సముద్ర తీరంలో వరుసగా నిలబెట్టిన బోట్లు చాలా అందంగా ఉన్నాయి కదా. బీచ్, పార్కు ఇలా అన్నిచోట్లకు వెళ్లి బాగా జాలిగా ఎంజాయ్ చేశారా? అవునా అయితే ఈరోజు బోట్లో జరిగిన ఒక నిజమైన సంఘటన విందామా? ఒకరోజు బోట్లో వెళ్లి చేపలు పట్టుకుని ఆ చేపలను అమ్ముకొని బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చారు పీటర్ మామయ్య . ఒక రోజు రాత్రంతా ఎంతో ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు. పీటర్ మామయ్య చాలా బాధతో ఉన్నారు. సరే వలలైనా శుభ్రం చేసుకుందామని సముద్రపు ఒడ్డున వలలను శుభ్రము చేసుకుంటున్నారు. ఆ సమయంలో హీరో అయినా యేసయ్య అక్కడికి వచ్చారు. చూడండి ఏసయ్యను చూసినా ప్రజలు గుంపులు గుంపులుగా ఆ సముద్ర తీరానికి రావడం ప్రారంభించారు. పీటర్ మామయ్య మొఖం చాలా దుఃఖముతో నిండిపోయి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం ముగించారు. బోటును సముద్రపు లోతునకు నడిపించి వలలు వేయమని యేసయ్య పీటర్ తో చెప్పారు. మేము రాత్రంతా వలలు వేసిన ఏ చేపలు మాకు దొరకలేదు మేము చేపలు పట్టడంలో మంచి అనుభవము గలవారమని చెప్పకుండా యేసయ్య చెప్పిన వెంటనే పీటర్ మామయ్య వలలను సముద్రంలో వేశారు. వెంటనే వలలు పిగిలిపోయే అంతగా చేపలు దొరికాయి. మిగతా బోట్లో ఉన్న వారిని సహాయం చేయుటకు పిలిచారు. ఆ పడవ నిండిపోయింది ఎంత అద్భుతం. యేసయ్య చెప్పిన వెంటనే చేసినందువలన పీటర్ మామయ్య ఆశీర్వాదం పొందుకున్నాడు. వెంటనే చేపలు పట్టే పీటర్ మామయ్య చేపలు పట్టకుండా మనుషులను పట్టే జాలారిగా యేసయ్య అతనిని మార్చేశారు. యేసయ్య మాటకు లోబడితేనే ఈ లోకంలో ఆశీర్వాదం మరియు పరలోకంలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి కదా! కాబట్టి మీరు కూడా యేసయ్య మాటలకు బైబిల్ లో చెప్పబడిన మాటలకును లోబడి జీవించినప్పుడు మంచి ఆశీర్వాదము మిమ్మల్ని వెతికి వస్తుంది. ఏంటి పిల్లలు మేము మా తల్లిదండ్రులకే లోబడుట కష్టము మరి యేసయ్యకు ఎలా లోబడతాము అని అనుకుంటున్నారా? యేసయ్యకు మీ జీవితాన్ని అర్పిస్తున్నప్పుడు చాలా సులువుగా ఉంటుంది మీ జీవితం బాగా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారు. సరేనా! 

- సహోదరి బ్యులా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al