Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.06.2023
Share:

By Village Missionary Movement

Saturday, 03-Jun-2023

దిన ధ్యానము(Telugu) 03.06.2023

 

అంశం: సరిపోల్చి చూచుట

 

"నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది" - మత్తయి 20:14

 

ఒక దినం ఉదయకాలంలో మత్తయి సువార్త 20 అధ్యాయం చదువుతున్నాను. ఈ ఉపమానంలో వచ్చే యజమానుడు గురించి ఆలోచించాను ఎందుకు యజమానుడు అందరికీ ఒకేలాగా కూలీ ఇవ్వలేదు. తక్కువ సమయం పని చేసిన వారికి ఎక్కువ సమయం పని చేసిన వారికి ఒకే విధముగా కూలి ఇచ్చారే అనే ఆలోచన. అప్పుడే సరిపోల్చి చూచుట సరియైనది కాదు అని అర్థం చేసుకున్నాను. కుమార్ మంచిగా చదివి గవర్నమెంట్ పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి ఉన్నాడు. సంతోషముతో గెంతులేస్తూ ఉన్నాడు। కానీ మరుసటి రోజు ఉదయం , కుమార్ యొక్క సంతోషము కనిపించకుండా పోయింది. దుఃఖముతో మునిగిపోయాడు ఎందుకో తెలుసా? వాడి ఫ్రెండ్ రవికి వాడికంటే ఐదు మార్కులు ఎక్కువ వచ్చాయి అని తెలుసుకున్నాడు. సరిపోల్చి చూచుట సంతోషం యొక్క ప్రధానమైన శత్రువు. మనం ఏమి సాధించాము అనేదాంట్లో సంతోషించాలి. 

 

దేవుడు మన కొరకు పెట్టిన మార్గంలో మనం నడవాలి. ఇతరుల యొక్క కార్యంలో సరిపోల్చిన ఎడల మన సంతోషం మరుగైపోతుంది. కొందరు ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చిన మిగిలిన వారి యొక్క హెచ్చింపును చూసి సరిపోల్చుకుని తమకు తాము పొందుకున్న హెచ్చింపులు అనుభవించకుండా పోతున్నారు. దేవుడు మనకు ఇచ్చి ఉన్న మంచి తలాంతులను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇతరుల యొక్క తలాంతులు మరియు వారికి మంచి పరిస్థితిని గమనించడం ప్రారంభిస్తే మనం ఎంత పొందుకున్న మనకు సంతోషమే ఉండదు. దేవుడు మనకు పెట్టి ఉన్న మార్గంలో మన పరిగెడదాం. కచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలైన కార్యాలు చేస్తారు. సరిపోల్చి చూచుకొని మనకు మనమే దేవుని దీవెనలను మరుగుపరచకూడదు. 

 

ఒక తల్లి కుమారుని కొరకు ప్రార్థించినప్పుడు తన పెద్ద కుమారుడు వలె ఈయన కూడా ఒక వైద్యము చదివిన యెడల చాలు ప్రభువా అని అన్నారు. దేవుడు నువ్వు ఎవరు నీ చిన్న కుమారుడికి పరిమితిని నిర్ణయించుటకు అని అడిగారు. పూర్వపు ఆలయ మహిమ కంటే తరువాత దేవాలయపు మహిమ ఘనంగా ఉంటుంది అన్నారు. ఆలయం అంటే ఏమిటి మనమే ఆలయం. అది మొదలుకొని ఆ తల్లి తన పిల్లల కొరకు ప్రార్థించుటలో చాలా జాగ్రత్తగా వహించారు. కాబట్టి తల్లిదండ్రులారా పిల్లలను ఇతరులతో పోల్చి చూసి వాళ్ళ యొక్క ఎదుగుదలను ఆపివేయకండి. అభ్యంతర పరచకండి దేవుని చిత్తములో నిలిచి ఉండుడి. 

- శ్రీమతి. బెర్లిన్ స్టెల్లా బాయ్ గారు 

 

ప్రార్థన అంశం:

ప్రార్ధన గుంపులు కూడుకొని ప్రార్థిస్తున్నా ఇళ్లల్లో దేవుని మహిమ నిలిచి ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet