Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.06.2023
Share:

By Village Missionary Movement

Friday, 02-Jun-2023

దిన ధ్యానము(Telugu) 02.06.2023

 

అంశం: పరిపూర్ణుడైన ప్రభువు

 

"దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు" - ప్రసంగి 3:11

 

మార్గ మధ్యలో వెళుతున్న ఒక ఆయన పొలము వైపు నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు గుమ్మడికాయ తోటలో పెద్ద పెద్ద గుమ్మడి కాయలు కనబడుతూ ఉన్నాయి. దానిని చూసిన వ్యక్తి ఏమిటి దేవుని సృష్టి సరిగా నిలబడలేని ఈ మొక్కలో ఇంత పెద్ద గుమ్మడికాయను చేసి ఉన్నారే అని సనుగుకున్నాడు. దానిని ఆలోచిస్తూ నడిచి వెళ్ళాడు. ఎండ ఎక్కువగా ఉన్నందువలన అలసటతో రోడ్డు పక్కనే ఉన్న ఒక మఱ్ఱి చెట్టు కింద పడుకున్నాడు. కొంత సమయం తర్వాత ఆ మరి చెట్టుకు గల పండు ఒకటి అతని తల మీద పడింది. ఈ గుమ్మడికాయ గురించే ఆలోచిస్తూ ఉన్నవాడు కాబట్టి గుమ్మడికాయ నా తల పైన పడింది అని బెదిరిపోయి లేచి చూచినప్పుడు ఒక చిన్న మర్రి పండు తలపక్కనే పడి ఉంది. ప్రభువా ఇంత పెద్ద చెట్టుకు గుమ్మడికాయను నువ్వు చేసి ఉండిన యెడల నా తల ఏమై ఉండేదో? జ్ఞానవంతమైన నీ సృష్టిని బట్టి నీకు వందనాలు అని చెప్పాడు. 

 

పాత నిబంధనలో ఇస్సాకు రిబ్కా దంపతులను మనము చూస్తాం. ఇస్సాకుకు భార్యను చూచుటకు అబ్రహాము సేవకుడిని పంపి కొన్ని నిబంధనను చెప్పి పంపించారు. దానిని బట్టి ఆ సేవకుడు అబ్రహాము చెప్పినట్లుగా అలాగే లోబడి రిబ్కా ఇంటికి వెళ్లి కార్యాలు చక్కగా జరుగుతున్న వాటిని చూశాడు. అప్పుడు ఆ పనివాడైనా యెలియాజరు నన్ను తిన్నని అయిన మార్గమును నడిపించిన నా యజమానుడైన అబ్రహాము యొక్క దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని అన్నాడు. 

 

అవును ప్రియమైన వారలారా! మన దేవుడు సంపూర్ణము గల దేవుడు, అనంత జ్ఞానం కలవాడు. మన ప్రతి ఒక్కరిని సంపూర్ణముగాను తన శ్రేష్టమైన మార్గంలోని నడిపిస్తున్నారు. మనం సృష్టింపబడినది మొదలుకొని దేవుడు మనలను తినని మార్గంలో నడిపిస్తున్నారు. మన శరీర అవయవాలను చక్కగా చేసి ఉన్నారు. ఈ లోకంలో ప్రతి దానిని నైపుణ్యతతో చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతిరోజు ప్రతి కార్యాన్ని చూసినప్పుడు దానిని చూచి ఆనందించడం మాత్రమే కాదు చక్కగా సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఈ నెలలో గల 30 దినాల్లో 30 ఇళ్లల్లో ప్రార్థన గుంపులు ద్వారా ప్రార్ధనలు క్రమముగా జరుగులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet