Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.03.2021
Share:

By Village Missionary Movement

Thursday, 11-Mar-2021

దిన ధ్యానము(Telugu) 11.03.2021

ప్రారంభమయ్యే ప్రణాళిక:-

"యీ గొప్ప వింత చూచెదననుకొనెను" - నిర్గమకాండము 3: 3

పండ్లతో నిండిన అందమైన తోట అది. అందులో ఫలించి వృక్షాలు అన్ని కలిసి తమ యొక్క గొప్పతనము చెప్పడం ప్రారంభించింది. మొట్టమొదటగా ఆపిల్ చెట్టు మాట్లాడటం ప్రారంభించింది. నేను చాలా ఖరీదు, నన్నే అందరు కోరుకుంటారు, నా ద్వారానే ప్రజలు బలం పొందుకుంటారు. ఇలా మాట్లాడేటప్పుడే ఆరెంజ్ చెట్టు మాట్లాడుతూ నేను మాత్రం సామాన్యమా ఏమిటి సి విటమిన్ గల మంచి రంగు గల పండును నేనే అని గర్వంగా చెప్పుకుంది. ఇలా వృక్షాలు అన్నీ కూడా తమ యొక్క పండ్లు గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించాయి. వీటన్నింటి తోటలో కంచేగా వేయబడిన ముండ్ల పొద నాలో ఎలాంటి మంచితనము లేదు నాలో ఉన్నది అంతా ముండ్లు కాబట్టి ఎవరు నన్ను దగ్గరకు తీసుకోరు. కాని మన దేవుడు ముండ్ల పొద నుండే మోషేతో మాట్లాడారు ఎందుకో తెలుసా?

ఐగుప్తులో బానిసలుగా ఉన్న లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు మోషే అనే  వ్యక్తితో దేవుడు ఆ ప్రజలను విడిపించుటకు మాట్లాడారు. దానినే మోషే ఒక అద్భుత దృశ్యంగా చూసాడు. అదే విమోచన ప్రణాళిక ప్రారంభానికి కారణము ఈ ముండ్ల పొదే.

ప్రియమైన వారలారా! ఈ దినము మీరు ఇతరులకు ముండ్లు కంపగా కనిపించవచ్చు. ఎవరు చేరదీయలేని, ఎవరు లెక్కచేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. మీ యొక్క శరీర బలహీనత, అమాయకత్వము, జ్ఞానము లేకపోవటం వలన మీరు తిరస్కరించబడవచ్చు. మీరు నిరుత్సాహ పడిపోవద్దు దేవుడు పరిస్థితులన్నింటిని ఆయన మార్చుటకు ఆయన సమర్ధుడు. ఎందుకు అంటే ఆయన పరిస్థితులన్నింటికంటే ఆయన గొప్పవాడు. ముండ్ల పొదను అద్భుత దృశ్యంగా మార్చి ఆ పొదలోనుండి విమోచన ప్రణాలికను ప్రారంభించిన దేవుడు మిమ్ములను ఆశ్చర్య పరిచే విధముగా మీ జీవితాన్ని మార్చి మీ యొద్ద తన ప్రణాలికను ప్రారంభిస్తారు. ఆయన యొద్ద మిమ్మల్ని సమర్పించుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తారా?
-    బ్రదర్. జె ఎబినేజర్

ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీల ద్వారా లక్ష గ్రామములు దర్శించబడెటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet