Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.05.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 31-May-2023

దిన ధ్యానము(Telugu) 31.05.2023

 

అంశం: వృద్ధులు

 

"తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను" - లేవీయకాండము 19:32

 

సెంట్ జోసెఫ్ హాస్పిటల్ కి హఠాత్తుగా ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. టెలిఫోన్ ఆపరేటర్ మరియు ఫోన్ చేసిన వ్యక్తికి మధ్య జరుగుతున్న సంభాషణ చూద్దాం. 

 

ఆపరేటర్: హలో ఎవరు మాట్లాడుతున్నారు? 

 

పిలిచిన వ్యక్తి: శ్రీమతి నార్మే పిల్లే అనే పేషెంట్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి వారికి సహాయం చేసే వారు ఎవరైనా ఉంటే పిలవండి. 

 

ఆపరేటర్: మంచిదమ్మా నేను మీకు సహాయం చేస్తాను. పేషెంట్ యొక్క పేరు రూమ్ నెంబర్ చెప్పండి. 

 

పిలిచిన వ్యక్తి: వణుకుచున్న స్వరముతో నార్మే పిల్లే, రూమ్ నెంబర్ 302.

 

ఆపరేటర్: నర్స్ యొద్దకు వెళ్లి ఈ మాటను చెప్పేసి తెలుసుకొని వస్తాను వేచి ఉండండి. కొన్ని నిమిషాల తర్వాత అమ్మ నీకు ఒక మంచి మాట సమస్య ఏమి లేదు బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంది అని చెప్పారు. రేపు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు అని డాక్టర్ చెప్పారు. 

 

పిలిచిన వ్యక్తి: చాలా సంతోషం నేను చాలా దుఃఖముతో ఉన్నాను మంచి మాటలు చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక! 

 

ఆపరేటర్: అవునమ్మా నార్మే పిల్లే మీ తల్లిగారా? పిలిచిన వ్యక్తి: లేదు రూమ్ నెంబర్ 302 లో గల నార్మే పిల్లే నేనే. వృద్ధురాలనైన నాతో ఎవరు ఏమి చెప్పడం లేదు కాబట్టి ఫోన్ చేసి అడుగుతున్నాను అని అన్నారు. 

 

వృద్ధాప్యంలో ఉన్న వాళ్లను అశ్రద్ధ చేస్తున్న కుటుంబాలు గల సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క మాటలు గమనించకుండా వాళ్లు యొక్క భావోద్వేగాలు లెక్కచేయబడని పరిశుద్ధులు చూడగలుగుతున్నాం. కానీ దీనికి బైబిల్లో వృద్ధులను ఘనపరచాలి అనే ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. దీనికి బైబిల్లో అనేక ఉదాహరణలు కలవు. వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి అయిన యాకోబును ఘనపరిచిన యోసేపు. తన అత్త అయిన నయోమి మాట విన్న రూతు. అవును వృద్ధులను ఘనపరిచిన వాళ్లను దేవుడు ఘనపరిచిన విధానాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. మనము కూడా మన ఇంట్లో గల తల్లిదండ్రులు ఘనపరచి జీవిద్దాం. వారితో మాట్లాడుటకు సమయాన్ని కేటాయిద్దాం. వాళ్లకు అవసరమైన సహాయం చేస్తూ ప్రభువు ఆజ్ఞను నెరవేరుద్దాం.

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:

మన మిషనరీలు ఉంటున్న ఇంట్లో గల కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet