Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.05.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 28-May-2023

దిన ధ్యానము(Telugu) 28.05.2023 (Kids Special)

 

అంశం: ఆకర్షించే బంధువు

 

"ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు" - ప్రసంగి 3:1

 

బ్రదర్ శేఖర్ కుటుంబము యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మంచి కుటుంబం. భార్య, భర్త, కుమారుడు, కుమార్తె అని ఒక అందమైన కుటుంబం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, బైబిల్ ధ్యానము, వాక్యము నేర్చుకొనుట కచ్చితంగా ఆ కుటుంబంలో ఉంటుంది. కుటుంబముగా కలిసి పాటలు పాడుతూ దేవున్నీ మహిమ పరిచేవారు. ఆదివారపు ఆరాధన సండే స్కూల్ అని పిల్లలు క్రమంగా పాల్గొనేవారు. ఆ కుటుంబాన్ని దేవుడు మిక్కిలిగా దీవించారు. సంతోషము ఆ ఇంట్లో పొంగిపొర్లింది. 

 

శేఖర్ గారు ఒకరోజు ఆకర్షించే బంధువు ఒకరిని ఇంటికి తీసుకుని వచ్చారు. నాన్న ఉండేటప్పుడు మాత్రమే ఆ బంధువు అందరితో కలిసి మాట్లాడుతారు. మిగిలిన సమయాల్లో కుటుంబ కార్యాలు యధావిధిగా క్రమంగా జరుగుతూ ఉండేవి. కానీ ఆ కొత్త బందువు అందరితో పరిచయమైన వెంటనే ఉదయము లేవగానే ఆయనతో మాట్లాడడం ప్రారంభించే వారు. సమయం ఎలా గడిచిపోయేదో వారికి తెలిసేది కాదు. ఉదయకాలపు ప్రార్థన పాటలు బైబిల్ చదువుకోవడము అన్ని కొద్ది కొద్దిగా తక్కువైపోయాయి. ఆయన తరచుగా వారితో పరిచయము పెంచుకున్న కొలది ఎక్కువ సమయం కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో సమయం కేటాయించే వారు. ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం అయిపోయింది. కొన్ని దినములు అయిన తర్వాత పిల్లలు చదువు సమయంలో కూడా ఆ కొత్త బంధువుతో చాలా సంతోషముతో సమయాన్ని కేటాయిస్తూ వారు చదువును మర్చిపోయారు. రాత్రి భోజనం చేసినప్పుడు కూడా అతనితోనే ఉండేవారు. కాబట్టి కుటుంబము ఆ ఊరిలో జరిగిన కార్యక్రమాలు, ప్రమాదాలు, రాజకీయ పరిస్థితులు అని అన్ని పరిశీలించి చూచుటలో వారి సమయం చాలా గడిచిపోయింది. రాత్రికాల ప్రార్థన లేకుండా పోయింది. కొత్త బంధువు కుటుంబాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు. దేవుణ్ణి, మనుషుల్ని, కుటుంబం మర్చిపోయినట్లు చేశాడు. కొన్ని దినముల తర్వాత చర్చికి వెళ్లడం అనేది కూడా లేకుండా పోయింది. సండే స్కూలు పిల్లలు మర్చిపోయారు. 

 

ఎవరు ఈ ఆకర్షించే బంధువు? ఈయన మరెవరో కాదు మిస్టర్ టీ.వీ. దేవునికి ఇవ్వవలసిన ఉదయపు సమయము కుటుంబీకులతో ఒకరికొకరు మాట్లాడుకునే సహాయం ఆరాధన చేసుకునే ఆ యొక్క సమయము, ఆలయంలోనికి వెళ్లి దేవునికి మహిమ పరిచే సమయము అని అన్ని సమయాలను తన వైపు లాగేసుకున్నారు మిస్టర్ టీ.వీ. ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు రావడం ప్రారంభించాయి. నాన్న తీవ్రంగా ఆలోచించారు. పిల్లలు మాటలు కూడా కార్టూన్ వలె మారిపోయాయి. పిల్లలు దేవుని బయభక్తులలోను, చదువులోనూ వెనకబడిపోయారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ బంధువుని అట్టపెట్టెలో పెట్టేసి అమ్ముటకు తీసుకొని వెళ్లేటప్పుడు ఆ కుటుంబమే దుఃఖములో మునిగిపోయింది. కానీ మరలా ఒకటి రెండు దినాల్లో సాధారణ పరిస్థితికి వచ్చేసారు. ఇంట్లో పాటలు శబ్దము బైబిల్ ధ్యానము మరల వినబడింది. 

 

హలో పిల్లలు మీరు కూడా టీ.వీ కి బానిస కాకూడదు. టీ.వీ తో సమయాన్ని ఎక్కువగా వెచ్చించకండి. టీ.వీ చూచుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతసేపు మంచి కార్యక్రమాలను చూసేసి దాన్ని ఆఫ్ చేయాలి. అదే ఎన్నటికీ మంచిది.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al