Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.05.2023
Share:

By Village Missionary Movement

Thursday, 25-May-2023

దిన ధ్యానము(Telugu) 25.05.2023

 

అంశం: నిజమైన ఆరాధన

 

"నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త" - కీర్తనలు 62:1

 

ఒకసారి ప్రసిద్ధిగాంచిన ప్రసంగికుడు హెన్రీ వార్ పిక్చర్ ఒక ఒక పెద్ద దేవాలయంలో ప్రసంగం చేయడానికి పిలవబడ్డారు. వెళ్ళుటకు అవ్వలేదు కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళలేకపోయారు. కాబట్టి అతని యొక్క సహోదరుడిని ఆ దేవాలయంలో ప్రసంగించుటకు ఆయన పంపించారు. ఆ దేవాలయంలో ప్రజలు ఎక్కువమంది ఉన్నారు కానీ ప్రసిద్ధిగాంచిన, బాగా మాట్లాడగలిగిన హెన్రీ పిక్చర్ ప్రసంగం చేయడానికి రాలేదు అని ఎరిగి చాలామంది చర్చి నుండి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. హెన్రీ యొక్క సహోదరుడు దానిని గమనించి ఏమాత్రం కూడా బాధ లేకుండా అక్కడ మాట్లాడుతున్న ప్రజలకు ముందుగా నిలబడి ఈరోజు హెన్రీ పిక్చర్ ను ఆరాధించడానికి వచ్చిన వారందరూ చర్చి ను విడిచిపెట్టి బయటికి వెళ్ళండి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పారు. 

 

మన యొక్క ఆరాధనలో మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఈ సేవకుని ద్వారా నాతో ఏమి మాట్లాడతారు అనే తలంపు కలిగి ఉన్నామా లేక ప్రసంగికుడు చేసే ప్రసంగాలు మంచిగా ఉన్నాయో లేదో తీర్పు తీర్చడానికి వెళుతున్నామా? ఒక ప్రసిద్ధిగాంచిన సేవకుడు ద్వారానే దేవుడు నాతో మాట్లాడతారు అనే తలంపు నీ దగ్గర ఉందా? ఇలాంటి తలంపు మన దగ్గర ఉంటే ఆరాధన ముగించుకుని మనము బయటకు వెళ్ళినప్పుడు మన మనసులో చాలా లోటు మనకు కనబడుతుంది. 

 

నాకు తెలిసిన ఒక పెద్ద సేవకుడు అధికారముతోనూ, హెచ్చరికలతోనూ ప్రసంగాలు చేసే కృపను పొందినవారు. ఒకసారి ఒక మీటింగ్లో ప్రసంగాలు ముగించుకొని క్రిందకు వచ్చినప్పుడు ఒక ఆమె వెళ్లి అయ్యా మీ ప్రసంగం చాలా బాగుంది అన్నారు. వెంటనే ఆ సేవకుడు నువ్వు దానికి లోబడ్డావా అని అడిగారు. ఎలాంటి ప్రసంగాలు వారు చేస్తున్నారు లేక మన వింటున్నామో అనే దానికన్నా విన్న వాక్యానికి లోబడుతున్నామా అనేదే ప్రాముఖ్యం. 

 

ప్రియమైన దేవుని వారలారా! మీరు నిజమైన దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారా? అలాగైతే పాడుతున్న పాటల్లో ఏముందో గ్రహించి పాటలను పాడండి. వాక్యమును వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనే ఆశతో వినండి. ప్రకటనలు చెప్పబడుతున్నప్పుడు ఆ వారంలో జరిగే వివాహంలో జతపరచబడబోతున్న వధూవరుల కొరకు రోజు ప్రార్థించండి. ప్రసంగములో హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరిక నాకు కాదు మిగతా వాళ్లకు అని కూర్చోకుండ ఆ హెచ్చరికకు లోబడండి. ఇలాంటి తలంపులతో ఆరాధనకు వచ్చేవారు మాత్రమే విలువైన ఆరాధనను పొందగలుగుతున్నారు. 

- బ్రదర్. యబన్ సంతోష్ గారు. 

 

ప్రార్థన అంశం:

కాంచీపురం ఫీల్డ్ లో పోన్ని అనే సహోదరికి దేవుడు గర్భఫలం దయచేయు లాగున ప్రార్థిద్దాం అలాగునే మన సేవకులను చూస్తున్న ప్రతి ఒక్కరు వారి ద్వారా దేవున్నీ తెలుసుకునేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet