Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.05.2023
Share:

By Village Missionary Movement

Saturday, 20-May-2023

దిన ధ్యానము(Telugu) 20.05.2023

 

అంశం: నేనే కారణము

 

"మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు" - మత్తయి 7:1

 

చెట్లు కొట్టే అతను ఒక బోధకుని ఇంట్లో ఉన్న చెట్టును కొట్టుటకు పిలవబడ్డాడు. అతడు చెట్టు కొడుతున్నప్పుడు అతని చెమట కింద పడింది దానిని తుడుస్తూ ఆదాము దేవుని మాటకు లోబడకుండా ఉండడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది। నా పైకి శాపం వచ్చింది. దానివల్లనే నేను కష్టపడి పని చేయవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పుకుంటూ పనిని చేసుకుంటూ ఉన్నాడు. దీనిని గమనిస్తున్న బోధకుడు వీడికి నిజాన్ని తెలియజెప్పాలి అనుకున్నారు. 

 

సాయంకాలం అయినప్పుడు ఆ చెట్టు కొడుతున్న అతను బోధకుని వద్దకు వచ్చి తన కూలిని పొందుకున్నాడు. ఆ కూలితోపాటు బోధకుడు ఒక పొట్లం అతనికి ఇచ్చి దీనిని జాగ్రత్తగా ఉంచుము. రేపు పనికి వచ్చినప్పుడు దీనిని తీసుకుని రా నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అని అన్నారు. ఆ చెట్లు కొట్టే వ్యక్తి దానిని తీసుకుని తన ఇంటికి ప్రయాణం ప్రారంభించాడు. ఈ పొట్లం జాగ్రత్తగా ఉంచుమన్నారు అలానే దీన్ని తీసుకుని వచ్చి ఇస్తే 100 రూపాయలు ఇస్తానన్నారు అంటే ఇందులో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో అని దాన్ని తెరిచాడు. వెంటనే ఆ పొట్లం నుండి ఒక ఎలుక పరిగెత్తుకొని అడవిలోనికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి బోధకుడికి ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే బోధకుడు నిన్న ఇవన్నీయు ఆదాము దేవుని మాటకు లోబడకపోవడం వలన నీవు అనుభవిస్తున్నావు అని చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు లోబడలేదు అన్నారు. కొంతమంది ప్రజలు ఎందుకు దేవుడు ఏదేను తోటలో మంచి చెడులు తెలుసుకునే చెట్టును ఉంచారు అని అంటారు. దేవుడు దాన్ని అక్కడ పెట్టి ఉండకపోతే హవ్వ ఆ పాపము చేసి ఉండేది కాదు అని అంటారు. 

 

మనిషి యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే తాను చేసిన తప్పిదములను ఇంకొకరి పైన నెట్టివేయడమే. ఆరోజు ఆదాము చేసిన దప్పిదమునకు ఆయన హవ్వ మీద తప్పు మోపాడు, హవ్వ సర్పం వైపు చూపించింది. ఈరోజు మనము కూడా అదే విధముగా నడుచుకుంటున్నాం. మనము చేసే తప్పిదాలకు పిల్లలు పైన, పిల్లలు చేసిన తప్పిదాలు తల్లిదండ్రుల పైన వేసుకుని చాడీలు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది వారి చేసిన తప్పిదములకు గవర్నమెంట్ పైన సమాజం పైన తప్పులు మోపుతారు కానీ న్యాయ తీర్పు రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు మన తప్పిదమునకు కారణంగా ఎవరి పైన ఆ తప్పులు మోపడం అవ్వదు. కాబట్టి ప్రియమైన వారులారా! మనము చేసిన తప్పులు ఎదుటివారిపైనా మోపకుండా మన తప్పిదములను ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణ అడిగినప్పుడు న్యాయ తీర్పు దినమున మనము దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. 

- శ్రీమతి. జ్యోతి ఆనంద్ గారు 

 

ప్రార్థన అంశం

కళ్ళకుర్చీ ఫీల్డ్ లో ఇంటింటా జరుగుతున్న కూటమిలో పాల్పొందులు పొందుతున్న వారి కొరకు మరియు బైబిల్ కాలేజ్ స్టూడెంట్ల కొరకు వారు ఉండుట కొరకు కట్టబడుతున్న కట్టడి పనులు త్వరగా పూర్తి అగులాగాన ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet