Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.05.2023
Share:

By Village Missionary Movement

Friday, 19-May-2023

దిన ధ్యానము(Telugu) 19.05.2023

 

అంశం: ఖాళీ స్థలం

 

"యేసుచూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను" - లూకా 19:42

 

డాక్టర్ యొద్దకు ఒక వ్యక్తి వెళ్ళాడు. అతనితో మాట్లాడిన డాక్టర్ మీకు ఏ సమస్య లేదు అయినను కొన్ని పరీక్షలు చేసి చూద్దాం అప్పుడు మీకు తృప్తికరంగా ఉంటుంది అన్నారు. పరీక్షలు రిపోర్ట్ వచ్చింది. అతని ఒంట్లో ఏ సమస్య లేదని తేలింది. అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ వద్ద మీరు నాకు ఏ వ్యాధి లేదు అని అంటున్నారు కానీ నాకు ఏదో వ్యాధి ఉన్నట్లు ఉంది. నేను ఏ పనిని సరిగా చేయలేకపోతున్నాను అని చెప్పాడు. వెంటనే డాక్టర్ ఈ విధంగా చెప్పారు. మీకు ఏ సమస్య లేదు కానీ మీ మనసులో సమస్య ఉంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మా హాస్పిటల్ పక్కనే ఒక సర్కస్ జరుగుతూ ఉంది. అందులో ఒక జోకర్ ఉన్నాడు అతను దగ్గరికి వెళ్తే అతను చేస్తున్న కార్యములు మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. అప్పుడు నీ బాధ తగ్గుతుంది అన్నారు డాక్టర్. అప్పుడు ఆ మనుష్యుడు ఆ డాక్టర్ను చూసి బాగా ఏడ్చి ఆ సర్కస్ లో పనిచేసే జోకర్ ను నేనే అని చెప్పాడు ఆ వ్యక్తి. 

 

దీనిని చదువుతున్న మనము మన మాటలతోనూ మన క్రియలతోనూ చాలా మందిని నవ్వించవచ్చు. మన చుట్టూ ఉన్న వారు ఎప్పుడూ నవ్వుతూ ఉండవచ్చు కాబట్టి అందువలన మన చుట్టూ ఎప్పుడు పెద్ద పెద్ద గుంపులు కలిగిన ప్రజలు ఉంటూ ఉంటారు. కానీ మన లోపల ఏదో ఒక కాళీ స్థలం. ఆ ఖాళీ స్థలాన్ని మనము మాత్రమే అనుభవిస్తున్నాం. లోకంలో ఉన్న ఒక్కొక్కరు ఏదో ఒక దానిని వెతుకుతూ ఉంటారు. ఒకరు నా జీవితంలో అవసరమైన డబ్బులు నాకు దొరికితే నాకు ఏ బాధ ఉండదు అని అనుకుంటారు. ఇంకొకరు నాకు మంచి ఉద్యోగం దొరికితే నా బాధలన్నీ తొలగిపోతాయి అని, మరొకరు నాకు మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం ఉంటే అంతస్తు ఉండి మంచి కుటుంబం దొరికితే నాకు ఈ కాలి స్థలం ఏది ఉండదు అని అనుకుంటారు. 

 

కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఖాళీ స్థలం ఉంటుంది. దానిని మన ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలరు హఠాత్తుగా మీకు కోటి రూపాయలు దొరికినను ఆ ఖాళీ స్థలాన్ని భర్తీ చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువును మీరు అంగీకరించండి అతను మీ హృదయములో ఉన్న లోటును బాధను తీసివేయగలరు. మీరు సంతోషంగా నిండి ఉండడానికి దేవుడు మీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు అతనిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? 

- సిస్టర్. ముత్తు లక్ష్మి గారు 

 

ప్రార్థన అంశం:

తిండికల్ ఫీల్డ్ లో ఉన్న జ్యోతి అనే అమ్మాయికి కాలులో ఉన్న పుండు తగ్గడం కొరకు మరియు బైబిల్ కాలేజ్ కి జూన్ నెలలో రాబోతున్న పిల్లలను దేవుడు క్షేమకరముగా నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet