Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.05.2023
Share:

By Village Missionary Movement

Friday, 12-May-2023

దిన ధ్యానము(Telugu) 12.05.2023

 

అంశం: ప్రతిజ్ఞ

 

"ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి" – 2 పేతురు 3:17 

 

వేల్స్ దేశంలో గల ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికులలో క్రిస్మస్ ఇవాన్స్ విశేషమైనవాడు. ఈయన ద్వారా వేల్స్ దేశంలో గొప్ప ఉజ్జీవము ఏర్పడింది. ఈయన మారుమనస్సు పొందిన దానిని చూసినా ఈయన యొక్క పాత దుష్ట స్నేహితులు ఇతనిని పట్టుకొని కొట్టి హింసించి ఒక కంటిని కోల్పోయే విధముగా చేశారు. ఈయన ఆంగ్లేసే అనే దీవిలో రెండు సంవత్సరాలు పరిచర్య చేశారు. కానీ తర్వాత దినాలలో పాత జీవితానికి నెట్టి వేయబడ్డారు. ఈయన యొక్క ఆత్మీయ జీవితము చల్లారిపోయింది. బైబిల్ ధ్యానం, ప్రార్థన, ప్రసంగం ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈయనను బలముగా దర్శించారు. ఈయన ఈ అనుభవం తర్వాత దేవునితో ఓడంబడిక అనే అంశము క్రింద ప్రతిజ్ఞలను రాసి ప్రతి ఒక్క దాని కింద ఆయన సంతకం చేశారు. అవి ఇలా ఉన్నాయి. 

 

1. నేను నా ప్రాణాన్ని శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువైన నీకే సమర్పిస్తున్నాను. పాపము నుండి నిత్యం మరణము నుండి నన్ను విడిపించి నిత్య జీవములోనికి నన్ను నడిపించండి. ఆమెన్! 

 

2. నేను మిమ్మల్ని సంపూర్ణముగా గ్రహించుటకు నాకు సున్నతి గల హృదయాన్ని దయచేయండి. మీ యొక్క తీర్పు దినమున నేను సిగ్గుపడేవాడిగా వేషధారణగా కనబడకుండా నన్ను మీ ఆధీనంలో నడిపించండి. ఆమెన్! 

 

3. నా సమయము, బలము, తలాంతులు అన్నింటినీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు నేను సమర్పిస్తున్నాను. ఆమెన్! 

 

4. నేను మిమ్మల్ని గూర్చి సనుగు కొనకుండా మిమ్మల్ని గాయపరిచే విధంగా ఏదైనా ఇరుకులో పడిపోకుండా నా శాంతిని కోల్పోకుండా నన్ను నేను కాపాడుకోనే కృప దయచేయండి. ఆమెన్! 

 

5. మిమ్మల్ని విడిచి ఎలాంటి పాపము నన్ను వేరు చేసినట్లు ఎలాంటి పాపపు క్రియలు నా మీద ఏలుబడి చేయకుండా మీ కృప దయచేసి నా జీవితం ముగించేలోగా ప్రయోజనం లేనివాడిగా కాకుండా ప్రయోజకునిగా నన్ను కాపాడండి. ఆమెన్! 

 

6. నన్ను పరిశీలించి నిత్య తీర్పు వచ్చినప్పుడు నేను వేరే విధంగా కనబడకుండా మీ దృష్టిలో ఎలాగు కనబడుతున్నానో అలాగే నేను నన్ను చూచుటకు కృపను దయచేయండి. మీరు నా గురించి తలంచుచున్న దానికంటే నేను మరీ ఎక్కువగా తలంచకుండా కృప దయచేయండి. ఆమెన్!

 

7. ఆకాశ పక్షులను పోషిస్తున్నట్టు అడవి పుష్పములను ధరింప చేస్తున్నట్లు కాకుండా మీ కుటుంబంలో ఉన్న సొంత బిడ్డను పోషిస్తున్నట్లు అర్హత లేని నన్ను కాపాడుకొనండి. ఆమెన్! 

 

క్రిస్మస్ ఇవాన్స్ యొక్క ఈ ప్రతిజ్ఞలు మన జీవితంలో కూడా ఈ దినము అంగీకరిద్దాం. 

- సహోదరి. యస్. జయ కుమారి గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీ.వీ మీడియాలో పనిచేసే అనుబవముగల సమర్పించబడిన వ్యక్తులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al