By Village Missionary Movement
Wednesday, 10-May-2023దిన ధ్యానము(Telugu) 10.05.2023
అంశం: కొండెములు చెప్పుట
"నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు" - లేవీయకాండము 19:16
ఆనాడు ఆదాము మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలతొ కొనసాగుతూ ఈనాడు మన వరకు కొండెములు చెప్పడం అనేది మన రక్తంలో ఉన్నటువంటి ఒక లక్షణముగా మారిపోయింది. ఇతరులను గూర్చిన కొండెములు వినడం అంటే పాలకోవా తినే అంత తీయగా తినేలోపే నోట్లో నీరు ఊరు అంత మధురంగా మారిపోయింది. ఇతరులపై కొడెములు చెప్పడం అనేది వారిని అల్పముగా చూడడంతో సమానము. ఇతరులపై కొండెములు చెప్పడానికంటే ముందు మనలో ఆ లోటు పాటలు ఉన్నాయా అని మనం చూడము. మనలో ఉన్న వెసులుబాటును చూసి లోటుపాటులను మర్చిపోతాం. ఈ చిత్రంలో ఉన్న లోటుపాట్లు మాత్రమే చూసి వారి యొక్క వెసులుబాటులను మరచిపోయే స్వభావము గలవారీగా మనం ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథం మనకు ఏమి బోధిస్తుంది అంటే వినయమైన మనసు గలవారై ఒకరికి ఒకరు మనకంటే యోగ్యులు అని ఎంచమని బోధిస్తుంది. ఉదాహరణకు ఒక గ్రామంలో గల సంఘముుుకు చిన్న సహాయము చేస్తున్న వ్యక్తిని చూసి ఇతడు ఏం చేస్తున్నాడు అని అల్పముగా చూసి అతడు చేస్తున్న పని విషయమై లోటు చెప్పే అవకాశం ఉంది. కానీ దేవుడు మాత్రం ఆ సహాయము చేయడానికి అతనిని అక్కడ ఉంచారు. ఆ పనిని మనము చేయట్లేదు కాబట్టి అతని విషయమై లోటు చెప్పడం సరైనది కాదు.
యేసుప్రభు వద్దకు వచ్చిన ధనవంతుడైన యవ్వనడు ఆయన చెప్పిన మాటలు విని వెసనపడుచు వెళ్లిపోయాడు. అనేక మంది ధనవంతులు ఇదే విధముగా ఉన్నారు అని చాలా సందర్భాలలో వారి విషయమై లోటులను చెబుతున్న మనం నీ ఆస్తిని అమ్మే బీదలకు ఇచ్చి తర్వాత వచ్చి నన్ను వెంబడించుము అని యేసు మనతో చెబితే మనలో ఎంతమంది ఆయనను వెంబడిస్తామో తెలియదు.
ప్రియమైన వారలారా! ఈ లోకస్తులు వలె ఇతరుల యొక్క లోటులను వినుటకు ఆత్రుత పడవద్దు. ఇతరుల యొక్క లోటుబాటులో చెప్పుకుంటూ తిరిగే రోజులు మనకు వద్దు। మిత్రుల యొక్క తప్పులను పొరుగు వారిని అడిగి స్పష్టముగా తెలుసుకుని వారినీ స్వల్పముగా చూసి పాపమునకు మనము చోటు ఇచ్చి ఉండవచ్చు. 1 కోరింది 10:12 లో తాను నిలుచున్నాను అని తలంచినవాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చిన్నచిన్న లోటుపాట్లను సరి చేసుకుందాం. ఇతరులను అల్పముగా చూడకుండా మనకంటే యోగ్యులుగా చూద్దాం. ఇటువంటి ఆలోచన మనలో ఉన్నట్లయితే ఒక మంచి ఆత్మీయ పందెమును పరిగెత్తి ముగించగలం. ఆమెన్!
- బ్రదర్. ఎల్. అలగర్ సామి గారు
ప్రార్థన అంశం:
ఆమెన్ విలేజ్ టీవీ యొక్క ఆర్థిక అవసరతలు తీర్చబడలడేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250