Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.05.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 07-May-2023

దిన ధ్యానము(Telugu) 07.05.2023 (Kids Special)

 

అంశం: వివిఎస్ వచ్చేసింది

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం. 

 

“నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు” - సామెతలు 11:30

 

హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? వేసవి సెలవులు వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది కదా! మే నెలలో ఎండలు చాలా భయంకరంగా ఉంటాయి. బయట తిరగకూడదు, నీళ్లు ఎక్కువగా తాగాలి అమ్మ నాన్న మాటలకు లోబడాలి ఓకేనా! మే నెల వచ్చిన వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది? సూపర్ కరెక్ట్ గా చెప్పారు వి.బి.ఎస్ గుర్తుకొస్తుంది. కొత్త పాటలు, కంటత వాక్యము, పప్పెట్ షో కథలు అన్ని వినవచ్చు. మీ ఊరిలో జరిగే వి.బి.ఎస్ కు మీరు కచ్చితంగా వెళ్లాలి సరేనా! సరే ఇప్పుడు ఒక కథ విందామా? 

 

రమేష్ ఉదయం త్వరగా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అన్నం పెట్టమ్మా నాకు టైం అవుతుంది అని అడిగాడు. అమ్మకు ఏమీ అర్థం కాలేదు ఏమైంది నీకు ఇంత త్వరగా బయలుదేరావు ఈరోజు నుండి నీకు వేసవి సెలవులు కదా అని అనగానే వెంటనే రమేష్ నవ్వుతూ అమ్మ ఇది ఏ నెలలో తెలుసా అని అడిగాడు. అప్పుడు అమ్మ ఇది మే నెల అంటూ ఓహో వి.బి.ఎస్ కి వెళ్తున్నావా? అది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తారు కదా నువ్వు ఎందుకు ఇంత త్వరగా బయలుదేరావు అని అడిగారు. వెంటనే రమేష్ అమ్మతో అమ్మ పోయిన సంవత్సరం వి.బి.ఎస్ టీచర్లు కొత్తగా ఇద్దరిని తీసుకొని రమ్మని చెప్పారు. మన ఊర్లో గోపి అంకుల్ వాళ్లు కొత్తగా అద్దెకు వచ్చారు కదా వాళ్ళ పిల్లలను తీసుకుని వెళ్తాను. మనము తెలుసుకున్న యేసయ్య ప్రేమను వారికి కూడా మనం చూపించాలి కదా అందుకే ఇంత తొందరగా వెళ్తున్నాను అని చెప్పాడు. అమ్మ కూడా రమేష్ ను సంతోషంగా వి.బి .ఎస్ కు పంపించారు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీరు కూడా రమేష్ వలె మీ ఇంటికి లేదా మీ పక్కింటికి గెస్ట్లుగా వచ్చిన పిల్లలను తీసుకుని ఈ సంవత్సరం వి.బి.ఎస్ కి వెళ్ళండి. ఇది మీ బాధ్యత అని కూడా చెప్పవచ్చు. ఇంకా మీ క్రైస్తవులు కానీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకుని వెళ్ళండి. మీరు వి.బి.ఎస్ కు తీసుకుని వెళ్లినవారు కచ్చితంగా మీతో పాటు పరలోకమునకు వస్తారు. ఆమెన్! 

- శ్రీమతి. శారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet