Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.05.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 03-May-2023

దిన ధ్యానము(Telugu) 03.05.2023

 

అంశం: నిజమైన ఆస్తి

 

"పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది" - ప్రకటన గ్రంథం 21:21

 

గనిలో బంగారాన్ని తవ్వి ఆ బంగారాన్ని తాను వెళ్లిన ప్రతి స్థలానికి తీసుకొని వెళ్లే ఒక కార్మికుని కద ఇది. ఒకరోజు అతను మరణించి పరలోకమునకు వెళ్ళాడు. ఇంకా బంగారాన్ని వదలకుండా మోస్తూనే ఉన్నాడు. పరలోకమంతా చూపించిన దేవదూత నీ సంచిలో ఏమున్నది దానిని మోస్తూనే ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ కార్మికుడు ఆ సంచిని తెరిచి చూపించి ఇలా అన్నాడు. ఇది మిక్కిలి ఖరీదైన బంగారం ఇదంతా నేనే తవ్వి తీశాను. ఎక్కడైనా ఉంచితే పోతుంది అని నా దగ్గరే భద్రంగా ఉంచాను అని అన్నాడు. దేవదూత గట్టిగా నవ్వుతూ ఇది రోడ్డు వేయడానికి ఉపయోగించే వస్తువు కదా దీనిని నువ్వు ఇంత భద్రంగా దాయుట వెర్రితనముగా ఉన్నది. నువ్వు రోడ్డు పక్కన పడి ఉన్న పెద్ద నల్లటి రాయిని పట్టుకొని భద్రంగా తిరుగుతూ ఉంటే నిన్ను చూసిన వారందరూ వెర్రివాడు అని అనుకుంటారు కదా! నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నాడు దేవదూత. అందుకు అతడు ఇది రోడ్డు వేసే వస్తువు కాదు ఇది బంగారం అని వివరించి చెప్పాడు. అందుకు ఆ దేవదూత భూమిపై దీనిని బంగారం అని అంటారు కానీ పరలోకంలో దీనిని రోడ్డు వేయడానికి ఉపయోగిస్తాం అని అన్నాడు. 

 

ఇది ఒక తమాషా కథ అయినప్పటికీ భూమిపైన విలువై నవి పరలోకములో పెంటకుప్పగా పిలవబడతాయి అని మనం గ్రహించేలా చేస్తుంది కదా. మన బంగారాన్ని మిక్కిలి విలువైనదిగా చూస్తాం మనం దానిని విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తాం కానీ పరలోకంలో మనము దాని పైన నడుస్తూ వెళ్తాం. 

 

లోకంలో మనము ఎక్కువ విలువను ఇచ్చి చేసేవి అనగా మనము కొనేవి లేదా సేకరించేవి అవసరం లేని వస్తువులు, పదవులు, బ్యాంకు లెక్కలు, పేరు ప్రసిద్ధి, ఇవన్నీ పరలోకంలో విలువైనవి కావు లోకానికి వీడ్కోలు చెప్పే సమయానికి వీటన్నింటికి ఏమి విలువ ఉంది. భూమి పైన మనకున్న ఆస్తులు అన్ని తాత్కాలికమైనవే నిరంతరమైనవి కావు అని జ్ఞాపకం ఉంచుకుందాం. మన యొక్క నిజమైన ఆస్తి పరలోకములో ఉన్నది. హల్లెలూయ! 

- బ్రదర్. వెర్నా 

 

ప్రార్థనా అంశం: 

ఈ నెల అంతా జరిగే వి.బి.ఎస్ పరిచర్యల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet