Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.04.2023
Share:

By Village Missionary Movement

Sunday, 30-Apr-2023

దిన ధ్యానము(Telugu) 30.04.2023

 

అంశం: పరాక్రమ గల బలాఢ్యుడు

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు।

 

“అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” - రోమీయులకు 8:37

 

హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా? మీకు దేవదూత కథ వినడం అంటే చాలా ఇష్టమా? మీరు కూడా దేవదూత వలె మారాలి తలపై బంగారు కిరీటం ఉండాలి అని కలకని మరి చూసి ఉంటారు కదా! సరే దేవదూతతో మాట్లాడిన గిద్యోను అంకుల్ గురించి బైబిల్ లో ఉన్న ఒక సంఘటన గురించి మీతో చెప్పాలా? 

 

రష్యాకు ఉక్రేణుకు యుద్ధం జరిగినట్లే ఇశ్రాయేలీయులకు మిద్యానీయులకు తరచూ యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగి ఉన్నప్పటికీ ఆయనకు లోబడకుండా ఉండటం వలన దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. కొన్ని సమయాల్లో మిడతల గుంపులు గుంపులుగా వచ్చి పొలములో ఉన్న చేను అంతటిని నాశనము చేసేస్తాయి కదా అదే విధముగా మిద్యానీయులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి బాగా పండిన పంటలను నాశనము చేసి ఇశ్రాయేలీయుల పశువులను, ఆహార పదార్థములను ప్రతి దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 

 

ఇశ్రాయేలీయులు చాలా శ్రమలను అనుభవించారు. వారిని ఎదిరించి యుద్ధము చేయడానికి ఇశ్రాయేలీయులలో ఎవరూ లేరు. తన పొలములో పండిన గోధుమలను ఎలాగైనా ఇంటికి తీసుకుని వెళ్లాలి అనుకొని గిద్యోను అంకుల్ పొలములో పనిచేస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన మాటలు విన్న గిద్యోను అంకుల్ కు సంతోషము కలగలేదు. యెహోవా మాకు తోడుగా వుంటే ఇదంతాయు మాకు ఎలా సంభవించును అని దేవదూతతో అన్నాడు. బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పిన దేవదూత మాటవిని గిద్యోను అంకుల్ కు ఒక నూతన విశ్వాసం కలిగింది. 

 

చిన్న గుంపు అయిన 300 మందితో గొప్ప సైన్యముగా ఉన్న మిద్యానీయులను ఓడించి విజయం సాధించాడు. గిద్యోను అంకుల్ పిరికివాడు అని పిలిచిన అనేకులు గిద్యోను అంకుల్ కు సెల్యూట్ కొట్టారు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీరు చెయ్యలేని పనులను చూసి భయపడుతున్నారా? భయపడవద్దు నేను మీతో కూడా ఉన్నాను అని అంటున్నారు. మన యేసయ్య నీవు చేయలేని వాటిని కూడా ఈజీగా చేసి గెలిచేలా చేస్తాడు. నీ చదువు, ఆటలు, రిజల్ట్ గురించి భయం ఉన్న జీసస్ తో మీరు ఉంటే విజయము పైన విజయం సాధించగలము. పిరికి వాడిని బలాఢ్యుడిగా మన యేసయ్య మార్చగలరు ఏమంటారు? అంతే కదా సరే ఒక కంటత వాక్యం కూడా నేర్చుకుందామా? 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet