Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.04.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 25-Apr-2023

దిన ధ్యానము(Telugu) 25.04.2023

 

అంశం: సర్టిఫికెట్

 

"మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు" - అపో.కార్యములు 13:22

 

పాఠశాలల్లో, కళాశాలలో జరిగే పోటీలలో విద్యను సాధించిన వారికి సర్టిఫికెట్ మరియు బహుమతులు అందజేయబడతాయి. ఈ సర్టిఫికెట్ను అందుకున్న వారు ఇతరులచే ప్రశంసించబడతారు. ఇంకా కళాశాల పూర్తయ్యాక కొన్ని సర్టిఫికెట్లు మిక్కిలి ప్రత్యేకముగా మంచి ప్రవర్తన గలిగిన వారికి అందజేయబడతాయి. 

 

పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువు అనేకమంది దైవజనుల కొరకు సర్టిఫికెట్లు ఇచ్చారు. మోషేను గూర్చి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నారు. నోవాహును గూర్చి నీతిపరుడు నిందారహితుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. దావీదును గూర్చి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అంటున్నారు. కానీ యెహోవా సౌలును గూర్చి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను అని అంటున్నారు. సౌలును రాజుగా నిర్ణయించినది దేవుడే ఇలా సాక్ష్యం ఇచ్చేది కూడా దేవుడే. కాబట్టి సౌలు దేవుని యొద్ద నుండి మిక్కిలి దుఃఖకరమైన సర్టిఫికెట్ను పొందుకున్నాడు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనమందరమును యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తముతో కడగబడి ఆయన చేత ఏర్పరచబడిన వారమైయున్నాము. కాబట్టి మనము ఆయన యొద్ద నుండి పొందుకున్న సర్టిఫికెట్ చాలా ప్రాముఖ్యమైనది. మన ఇంట్లో మనతో ఉండేవారు మనం పని చేస్తున్న స్థలాల్లో మన చుట్టూ ఉన్న వారి నుండి మనం పొందుకున్న సర్టిఫికెట్ ఏమిటో ఆలోచిద్దాం. రక్షకుడైన యేసుక్రీస్తు నుండి మనము పొందబోతున్న సర్టిఫికెట్ ఎలా ఉండబోతున్నది? దావీదు వలె ఆయన ఇష్టానుసారులమా లేదంటే సౌలు వలే దేవుని దుఃఖపరిచే వారమా ఈరోజే మనలను సరి చేసుకుందాం. మనలను సరి చేసుకోవడానికి యేసుప్రభు మనకు నిశ్చయముగా సహాయం చేస్తారు. పరలోకపు రాజు వద్ద నుండి మనము పొందబోతున్న సర్టిఫికెట్ మనలను నిత్యజీవమునకు నడిపిస్తుంది. ఆమెన్! 

- బ్రదర్. టీ. శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం: 

యూత్ మీటింగ్ కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయల అవసరమై ఉన్నది దాని కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet