Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.04.2023
Share:

By Village Missionary Movement

Sunday, 23-Apr-2023

దిన ధ్యానము(Telugu) 23.04.2023

 

అంశం: యేసు ఉంటే చాలు

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను" - 1 యోహాను 5:12

 

ఒక అందమైన గ్రామంలో రాజు అనే ఒక చిన్న తమ్ముడు ఉండేవాడు .తన తండ్రి ఆర్మీ సైనికుడిగా పనిచేసేవారు. ఆ గ్రామంలో అందరూ అతనిని చాలా ఎక్కువగా గౌరవించేవారు. దేశాన్ని రక్షించే సైనికుడు అని అతనిని చూసిన ప్రతి ఒక్కరు సెల్యూట్ కొట్టేవారు. రాజు వాళ్ళ నాన్న దగ్గర ఒక తుపాకీ ఉంటుంది. రాజు ఆ తుపాకిని తీయాలి అని ప్రయత్నించినప్పుడల్లా తన తండ్రి తనతో రాజు ఆ తుపాకీ లో ఉన్న బుల్లెట్ చాలా శక్తి గలది పెద్ద ఏనుగు ఎంత దూరంలో ఉన్నా గాని దానిని పడగొట్టే శక్తి గలది కాబట్టి దీనిని నువ్వు ముట్టకూడదు అని చెప్పేవారు. 

 

ఒకరోజు తన తండ్రికి సెలవు దొరకడం వలన కుటుంబంతో పాటు కలిసి టూర్ కి వెళ్లడానికి బయలుదేరారు. రాజు చాలా సంతోషంగా రెడీ అయ్యాడు. ఏంటి పిల్లలు టూర్ అనగానే మీకు కూడా చాలా ఆశగా ఉందా? రాజు మొదట వెళ్లి కారులో కూర్చున్నాడు. అప్పుడు నాన్న తనను రమ్మని పిలిచి ప్రార్థన చేసుకుని వెళ్లాలి అని చెప్పారు. మీరు కూడా ఎక్కడికి వెళ్లినా ప్రార్థన చేసుకుని వెళ్లాలి ఓకేనా. ప్రార్థించి బయలుదేరి గమ్యం చేరుకోగానే మరలా నాన్న ప్రార్థన చేశారు. తండ్రి చెయ్యని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు రాజు. అందమైన రంగురంగులు పువ్వులను చూస్తూ ఆనందిస్తూ నాన్న మీరు బలముగా, ధైర్యముగా ఉన్నారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు మరి ఎందుకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు అని అడిగాడు. తండ్రి నవ్వుతూ తన దగ్గర ఉన్న తుపాకిని తీసుకుని దానిలోని ఉన్న బుల్లెట్టును బయటకు తీసేసారు. దానిని పువ్వుల తోటలో పడేయమని చెప్పారు సరే అని బుల్లెట్టును ఆ పువ్వులు తోటలో పడేసాడు రాజు. కానీ ఏమీ జరగలేదు. ఇదే బుల్లెట్ తుపాకీలో ఉంటే దాని పవర్ ఏంటో నీకు తెలుసు కదా. నేను ప్రార్థన చేసినప్పుడు జీసస్ నాలోనికి వస్తున్నారు నాకు సహాయం చేస్తున్నారు. నేను చేయవలసిన పనులను నాకు నేర్పిస్తున్నారు బుల్లెట్ తుపాకీలో ఉంటేనే దాని శక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రార్థన యేసుతో మనలను ఐక్యపరిచే పవర్ఫుల్ సూపర్ మాన్ అని చెప్పారు. ప్రార్ధన రహస్యం రాజు తెలుసుకున్నాడు. 

 

ప్రియమైన పిల్లలారా! ఎంతటి గౌరవము, ఆస్తులు ఉన్నను యేసయ్యా లేకపోతే అంత సున్నా. ఏమీ లేకపోయినా యేసయ్య మాత్రమే ఉన్నప్పుడు దేనినైనా చేయవచ్చు. అందుకొరకే నీవు యేసయ్యతో మాట్లాడాలి సరేనా! 

 

శ్రీమతి అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al