Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.04.2023
Share:

By Village Missionary Movement

Saturday, 22-Apr-2023

దిన ధ్యానము(Telugu) 22.04.2023

 

అంశం: యేసుక్రీస్తు కన్నీరు

 

"ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి" - లూకా 19:41-42 

 

యేసు క్రీస్తు ప్రభువు యెరుషలేము పండుగకు గాడిద పిల్లపై వస్తున్నారు. అక్కడ శిష్యులు మరియు అనేకమంది ప్రజలు ఆయనతో సంతోషంగా కేకలు వేస్తూ వస్తున్నారు. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని దేవుని స్తుతిస్తున్నారు. యేసు యెరుషలేము పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమును గూర్చి ఆయన ఎరిగి ఉండుటవలన ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చారు. యేసుక్రీస్తు కన్నీరు కార్చిన రెండు సంబవాలలో ఒకటి లాజరు చనిపోయినప్పుడు ఇంకొకటి యెరుషలేము పట్టణమును చూచి ఆయన శిలువను మోస్తూ వెళ్తున్నప్పుడు ఆయన వెనుక ఏడుస్తున్న స్త్రీని చూసి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పెను. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు పడుతున్న శ్రమలను చూసి ఏడ్చారు కానీ యేసు యెరుషలేము పట్టణానికి మరియు అక్కడ ఉన్న ప్రజలకు దేవుని ఆలయమునకు కలుగబోవు నాశనమును గూర్చి కన్నీరు కార్చారు. సమాధాన కర్త అయిన తనను నిర్లక్ష్యం చేస్తున్నారు అని వారి కొరకు పరితపిస్తున్నారు. వారి కొరకు మాత్రమే కాదు యేసుక్రీస్తు యొక్క రక్తమును విలువ గల రక్షణను నిర్లక్ష్యము చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన కన్నీరు కార్చుతున్నారు. 

 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరీ సహోదరులారా ఆయన మీ కొరకు కన్నీరు కారుస్తున్నారా లేదా మిమ్మల్ని గూర్చి సంతోషిస్తున్నారా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకో అని చెబుతున్న ఆయన ప్రేమను చూడండి. ఆయన సిలువను మోసి కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటం పెట్టబడి ఎవరి కొరకు సిలువ వేయబడ్డారు ఆయన కొరకు లేదా మీ కొరక? ఆయన కన్నీటిని తుడవాలని నీవు ఆశించినట్లయితే ఆయనను రక్షకునిగా అంగీకరించు అప్పుడు నువ్వు సమాధానమును పొందుకుంటావు. సిలువ వేయబడిన వారిగా కాదు తిరిగి లేచిన క్రీస్తులా పరలోక రాజుల మనము చూసే రోజు సమీపంలో ఉన్నది సిద్ధపడుదాం. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం: 

యూత్ మీటింగ్లో చెప్పబోతున్న వాక్యం అనేకులకు ఉపయోగకరంగా ఉండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al