Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.04.2023
Share:

By Village Missionary Movement

Friday, 21-Apr-2023

దిన ధ్యానము(Telugu) 21.04.2023

 

అంశం: అలసిపోకుండా ముందుకు సాగు

 

"నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను" - 1 సమూయేలు 30:8 

 

స్కాట్లాండ్లో జన్మించిన అలెగ్జాండర్ డఫ్ సువార్త ప్రకటించడానికి భారతదేశానికి బయలుదేరారు. సముద్ర ప్రయాణంలో తన ఆస్తులను సర్టిఫికెట్లను పోగొట్టుకున్నారు. నువ్వు మిషనరీ పనికొరకు వెళ్లడం దేవుని చిత్తము కాదు అందుకే నీకు ఇవన్నీ ఎదురవుతున్నాయి అని ప్రజలు అనేవారు. అయినప్పటికీ కృంగిపోకుండా భారత దేశంలో గల అగ్రవర్ణ ప్రజల వద్దకు వచ్చారు. దేవుని కొరకు తెలుసుకొనుటకు పాశ్యత కలలు, సైన్స్, ఆంగ్లంతొ పరిశుద్ధ గ్రంధం నేర్పించాలి అని తన ఆలోచన జరిగించడం ప్రారంభించారు. కానీ ఇండియాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిరసన వ్యక్తం చేశారు. అయినను అయిదుగురు విద్యార్థులతో మఱ్ఱి చెట్టు కింద ఒక పాఠశాలను ప్రారంభించారు. ఒక వారంలో 300 మంది విద్యార్థులు అందులో చేరారు. తర్వాత అగ్రవర్ణ స్త్రీల కొరకు ఒక పాఠశాలను ప్రారంభించారు. అందులో కూడా చాలామంది ఆసక్తితో వచ్చారు. మూడు సంవత్సరాలలో ముగ్గురు యేసుక్రీస్తును అంగీకరించారు. 800 మంది విద్యార్థులు పాఠశాలలో చేరి విద్యను అభ్యసించారు. వీరు మిషనరీలుగా, సంఘ నాయకులుగా మారారు. 

 

డఫ్ నాశనమునకు మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ముందుకు వేసిన కాలు వెనకకు తీయకుండా ముందుకు సాగారు. దాని ఫలితం ప్రజల యొక్క అజ్ఞాన చీకటి తొలగిపోయింది. వారు దేవుని చూశారు. ఆంగ్లం భారతదేశంలోనికి వచ్చింది. 

 

పరిశుద్ధ గ్రంథములో కూడా దావీదు మరియు అతనితో కూడా ఉన్నవారు తమ భార్యలు పిల్లలు మరియు తమ తోటి వారిని కోల్పోయారు. వారు ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. తరుము అలసిపోవద్దు ముందుకు సాగు సమస్తమును దక్కించుకుందువని యెహోవా చెబుతున్నారు. దావీదుతో వెళ్లినది చిన్న గుంపే కానీ సమస్తమును దక్కించుకొనుటకు దేవుడు వారికి సహాయం చేశారు. 

 

అవును దేనినైనా కోల్పోయినప్పుడు మీలో ఆదరణ కర్త అయిన దేవుడు ఉండాలి. ఆయన ఉంటేనే మనం పరుగును ఆపకుండా విజయవంతముగా పరిగెత్తగలం. వ్యతిరేకత పోరాటాల నిమిత్తము మీరు చేసే కార్యాలు విడిచి మీ లక్ష్యములు విడిచి వెను తిరగవద్దు. మీ దృష్టి అంతా మీ లక్ష్యమును చేరుకోవడమే. వ్యతిరేకత పోరాటాలపై మీ చూపు పడకూడదు. మీ విషయం చేతికి అందే అంత దూరంలోనే ఉన్నది అలసిపోకుండా ముందుకు సాగండి. 

- శ్రీమతి. జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం: 

తక్కువ అద్దెకు వ్యాన్లు దొరికేలా మరియు డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేసేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet