By Village Missionary Movement
Wednesday, 19-Apr-2023దిన ధ్యానము(Telugu) 20.04.2023
అంశం: అల్పముగా చూడవద్దు
"గనుక ఎవడైన అతనిని తృణీకరింపవద్దు" - 1 కోరింథీయులకు 16:11
వసంత చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఆమె రూపు రేఖలు, మాటలు ఎవరిని ఆకర్షించవు. లోకస్తులు, కుటుంబసభ్యులు కూడా తనని చిన్న చూపు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో విలువైన దానివలె అందమైన దానివలె ఉన్నది కారణము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి వాక్యమునకు లోబడి ఉండటమే. ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆమె యొక్క అమాయకత్వం వలన అందరూ తనను హేళన చేసేవారు. వారు వారి యొక్క పనిని వసంతకు చేయమని చెప్పేవారు. ఏమీ తెలియని వసంత ఆ పనిని కూడా కష్టపడి త్వరగా పూర్తి చేసేది. ఆమె యొక్క వివాహ విషయంలో అష్ట కష్టాలు కలిగాయి. ఇందువలన ఆమె ఇంట్లో వారందరికీ ఆమె ఒక భారముగా మారిపోయింది. సంబంధాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె యొక్క బాహ్య స్వరూపమును చూసి పక్కకు తప్పుకునేవారు. కానీ దేవుడు ఎవరు ఊహించలేని ప్రకాశవంతమైన జీవితమును ఆమెకు ఇచ్చారు. ఆ వరుడు దేవుని యందలి భయభక్తులు గలవాడు. ఆమె అంతరంగ సౌందర్యాన్ని ఇష్టపడేవాడు. బాహ్య స్వరూపాన్ని పూర్ణ మనసుతో అంగీకరించి ఈనాటి వరకు వారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు.
పరిశుద్ధ గ్రంథంలో అల్పముగా ఎంచబడిన స్త్రీని గూర్చి మనకు తెలుసు ఆమె లేయా. యాకోబు లేయా కంటే రాహేలను అధికముగా ప్రేమించాడు లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచాడు. అవును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనుషుల దృష్టిలో మనము అల్పముగా ఉండవచ్చు మరువబడి ఉండవచ్చు కానీ మన దేవుడు అటువంటివాడు కాదు. ఈ లోకము దృష్టిలో అల్పముగా ఎంచబడిన వారిని పెంట కుప్ప మీద నుండి లేపి వారిని హెచ్చించాలి అనేదే దేవుని ప్రణాళిక. లోకము జ్ఞానవంతులను, సౌందర్యం గల వారిని ఏర్పరచుకొని పదవులను, బాధ్యతలను ఇస్తుంది. ఇది లోకజ్ఞానము కానీ దేవుడు అల్పముగా ఎంచబడిన వారిని ఏర్పరచుకుంటారు. కాబట్టి మనము ఎవరిని అల్పముగా చూడకూడదు. చిన్న అగ్గిపుల్ల యొక్క శక్తి కటిక చీకటిని మార్చుతుంది.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:
తల్లిదండ్రులు తన పిల్లలను పూర్ణ హృదయముతో మే 1వ తేదీన జరిగే మీటింగ్ నకు పంపించేలా ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250