By Village Missionary Movement
Wednesday, 19-Apr-2023దిన ధ్యానము(Telugu) 19.04.2023
అంశం: యేసు కొరకు భారాన్ని మోద్దాం
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును" - మత్తయి 11:28
1945వ సంవత్సరము ఆగస్టు 19వ తేదీన ప్రపంచాన్ని కదిలించే సంఘటన జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా సైన్యము జపాన్ దేశము పై హిరోషిమా నాగసాకి అనే స్థలాలలో అనుబాంబు వేసి సుమారుగా 2 లక్షల పైగా ప్రజలను హతమార్చింది. అప్పుడు అమెరికాలో గల ఒక యవ్వన మిలిటరీ అధికారి జరిగిన విధ్వంసాన్ని పర్యవేక్షిస్తూ ఫోటోలు తీసుకుని వచ్చాడు. బాధాకరమైన కొన్ని సంఘటన ఫోటో తీసినప్పుడు ఒక చిన్నవాడు చనిపోయిన తన సహోదరుడిని తన వీపు పైన పెట్టి మోసుకుని వచ్చుటను ఫోటో తీశారు. ఆ అధికారి ఆ చిన్న వాడిని చూసి అరే తమ్ముడు ఆ శవాన్ని పడేసి వెళ్లిపో లేదంటే నువ్వు త్వరగా అలసిపోతావు అని అన్నాడు. అందుకు ఆ చిన్నవాడు ఇతను నా సహోదరుడు నాకు ఇతడు భారముగా అనిపించడం లేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న అధికారి నెవ్వరిపోయి కన్నీరు కార్చారు. అతడు తీసిన ఫోటో ఈనాడు జపాన్ అంతా కలవడానికి ఆధారమైంది.
ఈనాడు లక్షల కోలది యవ్వనులు యేసయ్యను ఎరుగక మరణించే స్థితిలో నాశనమునకు వెళ్ళిపోతున్నారు. మనము ఒక కయీను వలె నేను అతనికి కావాలి వాడిన అని చెప్తున్నామా లేదా వారిని యేసయ్య చెంతకు తీసుకొని రావాలి అని ఆశ కలిగిన వారు వలె ఉన్నామా? పాపం, శాపం, రోగం, అప్పులు, ఉద్యోగం లేదు అని అనేక సమస్యలు అనే భారాల వలన నరకం వైపు వెళ్తున్న వారిని ప్రేమతో పిలిచి ప్రియుని ప్రేమగల సముదాయములోనికి మనము కూడా ఆ చిన్నవాని వలె వారిని మోస్తూ వస్తున్నామా? వారి పైన ప్రేమ ఉంటే నాకు భారం లేదు అని చెప్తాము. ఎందుకనగా వారు మన సొంత సహోదరులు సహోదరీలు. భారతదేశ యవ్వనలు యేసయ్యకే అనే భారము ఈనాడే మనలో కలుగును గాక! యేసయ్య కొరకు భారం మోయుటకు నిర్ణయించుకుందాం. హల్లెలూయ!
- బ్రదర్. భాగ్యనాదన్ గారు
ప్రార్థన అంశం:
మనము సేవ చేస్తున్న సేవా స్థలాలలో మే 1వ తేదీన జరగబోతున్న యూత్ మీటింగ్ లో ఒక లక్ష మంది యవ్వనులు వచ్చి పాల్గొను లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250